అమెరికా అధ్యక్షుడు ప్రపంచదేశాలకు పెద్దన్న డోనాల్డ్ ట్రంప్ నేడు భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. భారత్లో నేటి నుంచి రెండు రోజుల పాటు పర్యటించనున్నారు డొనాల్డ్ ట్రంప్. సకుటుంబ సమేతంగా భారత్లో పర్యటిస్తున్నారు. ఇక మొదటి సారి డొనాల్డ్ ట్రంప్ భారత్లో పర్యటిస్తున్న డంతో అహ్మదాబాద్ నగరం మొత్తం సర్వాంగ సుందరంగా అలంకరించ పడింది. ఇక ఇప్పటికే అహ్మదాబాద్ చేరుకున్న డోనాల్డ్ ట్రంప్ విమానాశ్రయం నుండి మొతేరా  స్టేడియం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం మోతేర  స్టేడియంలో నమస్తే ట్రంప్  కార్యక్రమంలో  డోనాల్డ్ ట్రంప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన నమస్తే అంటూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. అంతేకాకుండా భారతదేశం అమెరికా సత్సంబంధాలను ఎప్పుడూ ఇలాగే కొనసాగించాలి అంటూ డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. 

 

 

 ట్రంప్ ప్రసంగం అందరినీ ఆకర్షిస్తోంది. ఈ సందర్భంగా మోడీ పై ప్రశంసల వర్షం కురిపించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. భారత ప్రధాని నరేంద్ర మోడీ నా నిజమైన స్నేహితుడు అంటూ డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. భారత్తో సంబంధాలను రాబోయే రోజుల్లో మరింతగా మెరుగు పరుచుకుటామని  తెలిపారు. అంతేకాకుండా డోనాల్డ్ ట్రంప్ ప్రసంగంలో కాస్త లోకల్ టచ్ కూడా కనిపించింది. తనదైన వ్యాఖ్యలతో అందరిని ఆకర్షించారు డోనాల్డ్ ట్రంప్. ఇక తన ప్రసంగంలో భాగంగా దాయాది దేశం పాకిస్థాన్ గురించి కూడా పలు కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.

 

 

 తన ప్రసంగంలో భాగంగా దాయాది దేశమైన పాకిస్థాన్ ప్రస్తావన తీసుకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్... ఉగ్ర స్థావరాలపై గురించి మాట్లాడారు. పాక్ సరిహద్దుల్లో ఉగ్ర శిబిరాలు ఎన్నో ఉన్నాయని వాటిని రూపుమాపేందుకు తమ వంతు కృషి చేస్తున్నాము అంటూ ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు తెలిపారు. పాకిస్థాన్తో తమకు సత్సంబంధాలు ఉన్నాయి అంటూ వ్యాఖ్యానించిన  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇది ఇలాగే కొనసాగితుంది అంటూ  తెలిపారు. అటు ఉగ్రవాదం భారత్-అమెరికాల కు బద్ద శత్రువులు గా మారిపోయింది అంటూ వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: