ఈరోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈరోజు ఉదయం 11 గంటల 30 నిమిషాలకు అహ్మదాబాద్లోని ఎయిర్పోర్టులో భారత గడ్డపై అడుగుపెట్టిన డోనాల్డ్ ట్రంప్ ఆ తర్వాత నేరుగా సబర్మతీ ఆశ్రమానికి చేరుకున్నారు. ఇక అక్కడ సబర్మతి ఆశ్రమంలో ట్రంప్ కి ఘనస్వాగతం లభించింది. ఇక సబర్మతి ఆశ్రమంలో నేలపై కూర్చుని చరక చక్రాన్ని  కూడా తిప్పారు  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సతీమణి మెలీనియ. అనంతరం అక్కడి నుంచి నేరుగా మేతేరా  స్టేడియం కి రోడ్ షో ద్వారా డోనాల్డ్ ట్రంప్ చేరుకున్నారు . ఇక మోతేర  స్టేడియంలో నిర్వహించిన నమస్తే ట్రంప్ కార్యక్రమానికి లక్షల్లో ప్రజలు అక్కడికి విచ్చేశారు. ఇక మోతేరా స్టేడియానికి చేరుకున్న అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై ప్రసంగించి ప్రజలను ఆకర్షించారు డోనాల్డ్ ట్రంప్. 

 

 

 భారతదేశం ఎంతో గొప్ప దేశమని మోడీ భారత దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడానికి రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు అంటూ వ్యాఖ్యానించారు. అంతే కాకుండా భారత దేశం ఎంతో గొప్ప క్రికెట్ ఆటగాళ్ల ను అందించింది అంటూ వ్యాఖ్యానించారు డోనాల్డ్ ట్రంప్.  ఈ సందర్భంగా ఉగ్రవాదంపై కూడా విరుచుకుపడ్డారు. తమ దేశం ఉగ్రవాదాన్ని సహించబోదని దేశ సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పాల్సిన  అవసరం ఎంతైనా  ఉంది అంటూ వ్యాఖ్యానించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అంతేకాకుండా మోదీ నాయకత్వంలో దేశం ఆర్థిక పరిపుష్టి సాధిస్తుంది అంటూ చెప్పుకొచ్చారు. 

 

 

 ఈ సందర్భంగా భారతీయ పురుషులకు ఓ విషయంలో హెచ్చరించారు. భారతదేశ అభివృద్ధిలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. పారిశ్రామిక రంగంతో పాటు అన్ని రంగాల్లో పురుషులను వెనక్కినెట్టి మహిళలు దూసుకుపోతున్నారు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. కనుక పురుషులు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ... తనదైన స్టైల్లో వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. మరోవైపు ఇరు దేశాల మధ్య వ్యాపార వాణిజ్య సంబంధాలు మెరుగు పడేలా కృషి చేస్తున్నామని తెలిపారు. అంతే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం లో ఈ సభ ఏర్పాటు చేయడం తనకు గర్వంగా ఉంది అంటూ వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: