థర్టీ ఇయర్స్ ఇండ్రస్ట్రీ అంటూ సినిమా డైలాగులు పేల్చి బాగా ఫేమస్ అయిన సినీ నటుడు పృథ్విరాజ్ ఆ తరువాత పొలిటికల్ గానూ యాక్టివ్ అయ్యారు. మొదటి నుంచి రాజశేఖరరెడ్డి కి అభిమానిగా ఉంటూ ఆ తరువాత జగన్ ను కూడా అదే స్థాయిలో అభిమానిస్తూ వచ్చాడు. ఇక వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా ఆ పార్టీకి అండగా నిలవడమే కాకుండా జగన్ నిర్వహించిన పాదయాత్రలో అనేకసార్లు పాల్గొంటూ అప్పటి అధికార పార్టీ టిడిపి పై తనదైన శైలిలో విమర్శలు చేస్తూ వచ్చారు పృథ్వీరాజ్. ఇక ఎన్నికల ప్రచారంలోనూ ఆయన తనదైన శైలిలో టిడిపిపైన, ఆ పార్టీ విధానాలపై  వ్యంగ్యంగా అనేక వీడియోలను కూడా రూపొందించి ఎన్నికల్లో ప్రచారానికి దిగారు. 


ఆ ఎన్నికల్లో వైసీపీ తిరుగులేని మెజార్టీతో గెలుపొందడంతో జగన్ పృథ్వీరాజ్ కు సముచిత స్థానం కల్పించారు. ఏకంగా ప్రతిష్టాత్మకమైన ఎస్వీబీసీ చైర్మన్ గా ఆయనకు బాధ్యతలు అప్పగించారు. అయితే కొంతకాలానికి ఆయన ఓ మహిళతో సాగించించిన రహస్య సంభాషణ బయటకి రావడంతో ఆయన అడ్డంగా దొరికిపోయారు. దీంతో ఎస్ వి బి సి చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఇక అప్పట్నుంచి మీడియాలోనూ.. బయటా ఎక్కడ కనిపించకుండా అజ్ఞాతంలో ఉంటున్నారు. తాజాగా ఆయన తిరుమలకు వచ్చిన సందర్భంగా తన మనసులోని మాటలను బయట పెట్టారు.


 ఎస్వీబీసీ చైర్మన్ పదవి  కోల్పోవడం తీవ్ర ఆవేదనకు గురి చేసిందని చెప్పారు. ఎస్వీబీసీ పదవి నుంచి దూరం అయినప్పటి నుంచి తాను మానసిక ఒత్తిడికి గురయ్యానని, కొంతమంది కావాలని తనను కుట్రపూరితంగా ఈ వివాదంలో ఇరుక్కునేలా చేశారని మండిపడ్డారు. తనపై ఎవరు ఎందుకు కుట్ర పన్నుతున్నారో అర్థం కావడం లేదు అంటూ ఆయన తన బాధను వ్యక్తం చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇవ్వడంతో తనపై కుట్ర పన్నారని మండిపడ్డారు.


ఇదంతా తన చుట్టూ ఉన్నవారే చేస్తూ వెన్నుపోటు పొడిచారని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. తనకు ఇప్పటికీ, ఎప్పటికీ జగన్,  సజ్జల రామకృష్ణారెడ్డి,  వై వి సుబ్బారెడ్డి లకు మాత్రమే జవాబుదారీగా ఉంటానని, మిగతా ఎవరి గురించి తాను పట్టించుకోనని ఆయన వ్యాఖ్యానించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: