గత కొన్ని రోజులుగా అమెరికా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ బారత్ పర్యటనకు వస్తున్న విషయంపై తెగ హడావుడి నెలకొంది.  నేడు  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌లో అడుగుపెట్టారు. ఆయనకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఘన స్వాగతం పలుకుతున్నారు. ట్రంప్‌తో పాటు ఆయన భార్య మెలానియా, కూతురు ఇవాంక ట్రంప్‌, అల్లుడు జారెడ్‌ కుష్నర్‌ అహ్మదాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు.  సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 'నమస్తే ట్రంప్‌' వేదికకు చేరుకొన్నారు.  ఎయిర్ పోర్టులో ఎయిర్ ఫోర్స్ వన్ విమానం నుంచి దిగిన ట్రంప్ కు, తొలుత స్వాగతం పలికి నరేంద్ర మోదీ, కరచాలనం, ఆలింగనాలతో ఆహ్వానం పలుకగా, ఆపై, భారత సంస్కృతి, సంప్రదాయాలను పరిచయం చేస్తూ సాగిన ఆహ్వాన కార్యక్రమం ట్రంప్ ను అబ్బరపరిచింది.

 

శంఖాలు ఊదుతూ, డప్పు వాయిద్యాలు వాయిస్తూ, సంప్రదాయ నృత్యాలతో, గరగాటాలతో పలువురు ట్రంప్ కు స్వాగతం పలుకుతూ ఉంటే, వారందరినీ ఆశ్చర్యపూర్వకంగా చూస్తూ ట్రంప్ ముందుకు సాగారు. బర్మతీ ఆశ్రమంలో గాంధీ చరఖాను తిప్పి ట్రంప్ నూలు వడికారు. అనంతరం సబర్మతీ ఆశ్రమంలో ఉన్న మూడు కోతుల బొమ్మలను ట్రంప్‌ దంపతులు చూసి ముచ్చటపడ్డారు.ట్రంప్ తన భార్య, కూతురు, అల్లుడితో కలిసి అహ్మదాబాద్‌ నుంచి ఆగ్రా వెళ్లి తాజ్‌మహల్‌ చూస్తారు. భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా స్వాగత వేడుకలను నిర్వహిస్తున్నారు. ఇక భారత్ ప్యటనకు వచ్చిన ట్రంప్ కుటుంబానికి ఎవరి స్థాయిలో వారు బహుమతులు ఇస్తున్నారు. 

 

ఆయన కోసం రక రకాలు వస్తువులు తయారు చేశారు.  తాజాగా వరంగల్‌ జిల్లాకు చెందిన జాతీయ సూక్ష్మశిల్పి మట్టెవాడ అజయ్‌ కుమార్‌.. ట్రంప్‌ సూక్ష్మశిల్పాన్ని 1.00 మిల్లిమీటర్ల సూదిరంధ్రంలో మైనంతో చెక్కి అందరి దృష్టిని ఆకర్షించారు.  ఈ సూక్ష్మశిల్పాన్ని తయారు చేసేందుకు 4 రోజుల 13 గంటల సమయం పట్టింది. గతంలో దండి మార్చ్‌ మరియు ప్రధాని మోడీ  సూక్ష్మ శిల్పాలను సూది రంధ్రంలో చెక్కి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన విషయం తెలిసిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: