అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబ సభ్యులతో కలిసి భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అహ్మదాబాద్లో ఎయిర్పోర్ట్లో దిగి నేరుగా... సబర్మతీ ఆశ్రమానికి చేరుకున్నారు అమెరికా అధ్యక్షుడు అనంతరం ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం అయినా స్టేడియంలో ఏర్పాటు చేసిన నమస్తే ట్రంప్ కార్యక్రమంలో పాల్గొన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. నమస్తే ఇండియా అంటూ ప్రసంగించి అక్కడికి చేరుకున్న ప్రజలందరినీ ఆకర్షించారు. ప్రసంగంలో ఎన్నో కీలక విషయాలపై చర్చించారు. ఉగ్రవాదంపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ప్రపంచ దేశాలన్నీ శాంతికి పాటుపడాలి అంటూ సూచించారు.ఈ పర్యటనలో భాగంగా ఆగ్రాలోని తాజ్మహల్ వద్దకు చేరుకున్నారు డోనాల్డ్ ట్రంప్ కుటుంబం.. 

 

 

 ఈ పర్యటనలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో పాటు ట్రంప్ సతీమణి కూతురు అల్లుడు కూడా ఉన్నారు. ఇక డోనాల్డ్ ట్రంప్ కుటుంబం తాజ్ మహల్ సందర్శన నేపథ్యంలో తాజ్ మహల్ వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు. ఇక తాజ్ మహల్ చుట్టూ ఉన్న పరిసరాలను కలియతిరుగుతూ డోనాల్డ్  ట్రంప్  కుటుంబం తాజ్మహల్ యొక్క అందాలను వీక్షిస్తూ మైమరిచి పోతున్నారు. 

 

 

 ఇకపోతే... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటన నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు.అయితే  తాజ్మహల్ ప్రాంతంలో కోతుల బెడద ఎక్కువగా ఉందని స్థానికులు చెబుతున్నారు. ఎవరి చేతిలో నైనా సంచులు కనిపిస్తే వాటిని లాక్కొని పోతాయని అంటున్నారు స్థానికులు... ఇక అటు అధికారులు కూడా ట్రంపు సందర్శించిన సమయంలో ఏదైనా అసౌకర్యం కలుగుతుందేమో అని ఆందోళన చెందుతున్నారు. గట్రంప్  సందర్శన సమయంలో ఎవ్వరిని  కూడా తాజ్ మహల్ సందర్శనకు అనుమతించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: