బాధితులు పెరుగుతున్నారు..! మరణాలు పెరుగుతున్నాయి..! ఆర్ధిక వ్యవస్థ గందరగోళంగా మారిపోయింది..! వైరస్ ఎప్పుడు అదుపులోకి వస్తుందో తెలియదు..!  ఒక్క వుహాన్‌లోనే కాదు ఇతర ప్రాంతాల్లోకు కరోనా వేగంగా విస్తరిస్తోంది..! కరోనా విషయంలో చైనా అనుసరిస్తున్న విధానాలు విమర్శలకు దారితీస్తున్నాయి...ఇంతకీ కరోనాకు విరుగుడు దొరికేది ఎప్పుడు ?

 

చైనాలో పరిస్థితి రోజురోజుకీ ఆందోళకరంగా మారుతోంది. ఇప్పటికే కోవిడ్ 19 కారణంగా 2, 345 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 76 వేల 288 మంది కరోనా వైరస్‌తో బాధపడుతున్నారు. చైనాలో కరోనా వెలుగులోకి వచ్చినప్పటి నుంచి కరోనా మరణాలు లేని రోజు చైనాలో లేదంటే ఆశ్చర్యపోనవసరం లేదు. మరోవైపు  కరోనా బాధితులకు వైద్యం అందిస్తూ మరో డాక్టర్ ప్రాణాలు కోల్పోయాడు. ఇంకోవైపు 9 నెలల గర్భిణి నర్స్‌తో కూడా కరోనా వైరస్ బాధితులకు వైద్యం చేయించడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ప్రెగ్నెంట్‌గా ఉండి కూడా సర్వీస్‌ చేస్తున్న నర్స్‌ను చైనా రియల్ హీరోగా ప్రచారం చేస్తుంటే...ప్రపంచ దేశాలు చైనాను దుమ్మెత్తి పోస్తున్నాయి.  మానవత్వాన్ని పరచి అలాంటి ప్రమాదకర పరిస్థితిలో గర్భిణితో పనిఎలా చేయిస్తారని ప్రశ్నిస్తున్నారు.

 

కరోనా వైరస్...చైనా ఆర్ధిక వ్యవస్థను కుదిపేస్తోంది. చైనాలో కార్ల అమ్మకాలు 96 శాతం పడిపోయాయి. ప్రపంచంలోనే అతిపెద్ద కార్ల మార్కెట్ చైనానే.  వైరస్ వ్యాప్తి కారణంగా  ప్రజలు ఇళ్లకే పరిమితమవడం...కార్ల డీలర్ల కూడా షోరూమ్‌లను మూసి ఉంచడంతో వ్యాపారం నిలిచిపోయింది.  ఆమ్మకాలే కాదు...కార్ల ఉత్పత్తి కూడా గణనీయంగా తగ్గింది. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే ఆటోమొబైల్ రంగం సంక్షోభంలోకి వెళ్తుందని చైనా ఆందోళన వ్యక్తం చేస్తోంది.

 

మరోవైపు దక్షిణ కొరియాలో కూడా  కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తమ దేశంలో కరోనావైరస్ బాధితుల సంఖ్య ఒక్క రోజులోనే రెట్టింపయిందని దక్షిణ కొరియా ప్రకటించింది. కొత్తగా 123 కేసులు నమోదు కావడంతో దక్షిణకొరియాలో మొత్తం కేసుల సంఖ్య 602కు చేరుకుంది. దక్షిణ కొరియాలోని డేగు నగరంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యాయి... చైనా వెలుపల అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు నిర్ధారణయింది దక్షిణ కొరియాలోనే. 

మరింత సమాచారం తెలుసుకోండి: