మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఆశలపై బండి పడినట్లేనా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నేతల్లో అనుమానాలు పెరిగిపోతున్నాయి.  మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీకి ఘోర పరాజయం ఎదురైన దగ్గర నుండి పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావును మార్చాలని చంద్రబాబునాయుడు చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. నిజానికి రాష్ట్ర అధ్యక్షునిగా కళా ఉత్సవ విగ్రహంలాగ తప్ప ఇంక దేనికి పనికిరారు.

 

ఉండటానికి రాజకీయాల్లో కళాకు కూడా 30 ఏళ్ళ సర్వీసున్నప్పటికీ  సొంత జిల్లా విజయనగరం/ శ్రీకాకుళంలో ఎవరు కూడా ఆయన మాట వినరు. చివరకు  సొంత సామాజికవర్గంపైన కూడా ఏమాత్రం పట్టులేదు. మరలాంటపుడు కళాను చంద్రబాబు ఎందుకు రాష్ట్రంలో అధ్యక్షుడిని చేశాడు ? ఎందుకంటే చంద్రబాబుకు కూడా ఉత్సవ విగ్రహం లాగ ఉండేవారే కావాలి. స్వతంత్రించి, సొంత బుద్ధితో లేదా సొంతంగానే పట్టున్న నేతలైతే చినబాబు నారా లోకేష్ కూడా చాలా ఇబ్బందులు వస్తాయని.

 

ఈ విషయం ఆయనతో పాటు  అందరికీ తెలుసు. సరే ఇటువంటి నేపధ్యంలోనే ఎన్నికల్లో ఓడిపోయి మూలన కూర్చున్న తర్వాత గట్టి నేతను అందులోను బిసికి అధ్యక్ష పదవి ఇద్దామని అనుకున్నారు. ఇందులో భాగంగానే గట్టి బిసి నేతలను వెతికిన తర్వాత చివరకు అచ్చెన్నాయుడును ఫైనల్ చేశారని సమాచారం. ఈరోజో రేపో అచ్చెన్నను అధ్యక్షునిగా ప్రకటిస్తారు అనుకుంటున్న సమయంలో  ఆయనపై పెద్ద బండపడింది.

 

నాలుగురోజుల క్రితం బయటపడిన సుమారు వెయ్యి కోట్లరూపాయల భారీ  ఇఎస్ఐ స్కాంలో అచ్చెన్నదే కీలక పాత్రగా బయటపడింది. స్కాంపై దర్యాప్తు చేసిన విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు కూడా అచ్చెన్న పాత్రను స్పష్టంగా చెప్పారు. దాంతో స్కాంలో అచ్చెన్న తగులుకోవటం ఖాయమనే అనిపిస్తోంది. ఇటువంటి స్కాంలో ఈ మాజీ మంత్రికి అధ్యక్ష పగ్గాలు అప్పగిస్తే ఇంకేమన్నా ఉందా ? అందుకనే అచ్చెన్న పేరు వెనక్కిపోయిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంటే అదృష్టమంటే కళా దే అని తమ్ముళ్ళు చెప్పుకుంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: