రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ఏ పార్టీ ? ఇదేమి పిచ్చి ప్రశ్న అందరికీ తెలిసిందే కదా వైసిపి అని. కానీ మరి రాష్ట్రంలో జరుగుతన్నదేమిటి ? ఎవరు ఎవరిపై దాడులు చేస్తున్నారు ?  జరుగుతున్న ప్రచారం ఏమిటి ? ఇక్కడే అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి.  క్షేత్రస్ధాయిలో  జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరికీ ఆశ్చర్యంగా ఉంది. తాజాగా బాపట్ల వైసిపి ఎంపి నందిగం సురేష్ పై టిడిపి పెయిడ్ ఆర్టిస్టులతో దాడి చేయించి రివర్సులో ఎంపి మనుషులే తమపై దాడి చేసినట్లు గోల చేస్తున్నారు. తమ మీడియాలో విపరీతమైన రివర్స్ ప్రచారం చేయించుకుంటున్నారు.

 

ఇక్కడే చంద్రబాబునాయుడుపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే సురేష్ పై దాడి జరగటం ఇది రెండోసారి. అలాగే ఆమధ్య మాచర్ల ఎంఎల్ఏ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై రైతుల ముసుగులో  దాడి జరిగింది. మొన్నటికిమొన్న చిలకలూరిపేట ఎంఎల్ఏ విడదల రజనిపై దాడి జరిగింది. కాకపోతే కారులో ఎంఎల్ఏ లేకపోవటంతో పెద్ద ప్రమాదం తప్పిపోయింది. మద్యలో రోజా ప్రయాణిస్తున్న కారుపైన కూడా దాడి జరిగింది. దాదాపు గంటసేపు రోజాను కారులో నుండి దిగనీయకుండా అడ్డుకుని అమ్మ నా బూతులు తిట్టారు.

 

అంటే జరుగుతున్నది చూస్తుంటే ఈ దాడుల వెనుక చంద్రబాబు వ్యూహం ఉన్నట్లు స్పష్టంగా తెలిసిపోతోంది. వైసిపి ఎంఎల్ఏలు, ఎంపిలపై పెయిడ్ ఆర్టిస్టులతో దాడులు చేయిస్తు రివర్సులో  వైసిపి వాళ్ళే దాడులు చేస్తున్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నారు. అంటే దాడులు ఎంత ప్లాన్డుగా జరుగుతున్నాయో అర్ధమైపోతోంది. పైగా జరిగిన దాడుల్లో ఎక్కువగ భాగం ముందువరసలో ఆడవాళ్ళే ఉంటున్నారు. అంటే మహిళలను ముందు పెట్టి ప్రభుత్వాన్ని గబ్బు పట్టించే కార్యక్రమాన్ని చంద్రబాబు చేస్తున్నారు.

 

ఎక్కడైనా వైసిపి వాళ్ళో లేకపోతే పోలీసులో రెచ్చిపోయి తిరిగి పెయిడ్ ఆర్టిస్టులపై ఎదురుదాడి చేయటమే లేకపోతే కాల్పులు జరగాలన్నదే చంద్రబాబు వ్యూహమని అనుమానంగా ఉంది. అప్పుడు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్ధితి దారుణంగా ఉందని ఊరు వాడ ప్రచారం చేసి రాజకీయ లబ్ది పొందటమే చంద్రబాబు అసలు ఉద్దేశ్యం. ఎందుకంటే రాజకీయ లబ్దికోసం చంద్రబాబు ఎంతటి నీచానికైనా రెడీ అయిపోతారని ఇప్పటికే అనేక సార్లు రుజువైంది కాబట్టి. అందుకని వైసిపి వాళ్ళే జాగ్రత్తగా ఉండాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: