ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత మీడియా ఛానల్ సాక్షి. వైయస్ జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  ఏ మీడియా ఛానల్ పట్టించుకోని సందర్భంలో సాక్షి మాత్రమే జగన్ కార్యక్రమాలను కవర్ చేసేది. తాజాగా జగన్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వానికి  మరియు వైఎస్ఆర్సిపి పార్టీకి అనుకూలంగా పని చేస్తూనే ఉంది. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. చాలాసార్లు సాక్షి మీడియా మేము నిష్పక్షపాతంగా పనిచేస్తున్నామని ఓపెన్ గా చెబుతూనే మరోపక్క పక్షపాతంగా జగన్ ప్రత్యర్థులను చూపిస్తూ మీడియా రంగంలో రాణిస్తున్నారు.

 

ఈ విధంగానే తాజాగా ఓ సంఘటన చోటు చేసుకుంది.  విషయంలోకి వెళితే అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇండియా పర్యటన చేపట్టిన నేపథ్యంలో భారత ప్రధాని మరియు ఇండియన్ ప్రెసిడెంట్ రామనాథ్ కోవింద్ రాష్ట్రపతి భవనం లో విందు ఏర్పాటు చేసిన సంగతి అందరికీ తెలిసినదే. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి భవన్ అధికారులు దేశంలో ఉన్న కొంతమంది ముఖ్యమంత్రులను పిలవడం జరిగింది. ఇదే సందర్భంలో పొరుగు రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నీ ఆహ్వానించడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ని మాత్రం ఈ కార్యక్రమానికి పిలవలేదు.

 

అయితే ఈ సందర్భంలో సాక్షి మీడియా ఛానల్...ట్రంప్ పర్యటన గురించి వివరంగా ఆయనకు వడ్డించే వంటకాలతో సహా చెప్పిన జగన్ ని ఎందుకు పిలవలేదు అనే… ఈ సంగతి మాత్రం చెప్పలేదు. దీంతో సాక్షికి వ్యతిరేకంగా ఉండే మీడియా ఛానల్స్ ఈ విషయాన్ని లేవనెత్తి జగన్ మీడియా అంటూ తెగ దుమ్మెత్తి పోసే విమర్శలు చేస్తున్నాయి. డోనాల్డ్ ట్రంప్ పర్యటన గురించి హడావిడి చేసే కథనాలు ప్రసారం చేసిన సాక్షి...జగన్ ని పిలవకపోవడం వెనుక అసలు సంగతి చెబితే బాగుండేదని ఈ వార్తపై సోషల్ మీడియాలో నెటిజన్లు మరోపక్క కామెంట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఒక ఉద్దేశపూర్వకంగా జగన్ ని సాక్షి డిఫెన్స్ చేయడం కొన్ని విషయాల్లో తగ్గించుకోవాలని మరికొంత మంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: