అమెరికా అధ్యకుడు ట్రంప్ ఇండియా  వచ్చారు.. అయితే ఏంటి.. ఇంతకు ముందు కూడా చాలా మంది అమెరికా అధ్యక్షులు ఇండియాకు వచ్చారు కదా.. ఒకరా ఇద్దరా ఆరుగురు అమెరికా అధ్యక్షులు ఇండియా వచ్చారు. ట్రంప్ ఏడో వాడు. మరి ఈయన ప్రత్యేకత ఏముంది అనుకోవచ్చు. కానీ ఇప్పటి వరకూ ఏ అమెరికన్ ప్రెసిడెంట్ కూడా చేయని పని ఈ ట్రంప్ చేశాడు. ఆ విధంగా రికార్డు సృష్టించారు.

 

ఇంతకీ ఆయన సృష్టించిన రికార్డు ఏంటో తెలుసా.. కుటుంబ సమేతంగా భారత్‌ను సందర్శించిన తొలి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రికార్డు సృష్టించారు. అవును మరి.. ఇప్పటి వరకూ ఎవరూ పూర్తిగా ఫ్యామిలీలో ఇండియాకు రాలేదు. వస్తే పెళ్లాంతోనే.. లేకుంటే పిల్లలతోనే అదీ కాకుంటే సింగిల్ గానే వచ్చారు తప్ప.. ట్రంప్ మాదిరిగా ఫుల్లు ఫ్యామిలీతో ఇండియా వచ్చిన వాళ్లు లేరు. ఆ విధంగా ట్రంప్ ది రికార్డే.

 

గతంలో బిల్ క్లింటన్ భారత్‌లో పర్యటించినప్పుడు తన కూతురు చెల్సియాను వెంటబెట్టుకొచ్చారు. ఆ సమయంలో ఆయన భార్య హిల్లరీ క్లింటన్‌ ఇండియాకు రాలేదు. ఇక బరాక్ ఒబామా, రిచర్డ్ నిక్సన్, జిమ్మీ కార్టర్, జార్జి డబ్ల్యూ బుష్‌ వీరంతా తమ భార్యలను వెంట తీసుకొచ్చారు కానీ.. తమ పిల్లలను వెంటబెట్టుకురాలేదు. ట్రంప్ ఒక్కడే భార్య మెలానియా, కూతురు ఇవాంకాను వెంటబెట్టుకొచ్చారు.

 

ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటనలో ఇవాంక భర్త జారెద్ కుష్నర్ కూడా ఉన్నారు. ఆయన వైట్ హౌజ్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అధ్యక్షుడికి ఇవాంకతో పాటు సలహాదారుగా ఉన్నారు. ఇప్పుడు ఈ నలుగురు భారత పర్యటనకు రావడం ఇంట్రస్టింగా మారింది. ట్రంప్ కుమార్తె ఇవాంక భారతీయులకు సుపరిచితమే. ఆమె ఇది వరకే భారత్ లో పర్యటించించింది. 2017లో హైదరాబాద్‌లో జరిగిన పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొంది. ఇక పదవి చేపట్టిన ఫస్ట్ ఫేస్ లోనే ఇండియా వచ్చిన వారిలో ట్రంప్ నాలుగో వాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: