ఇప్పటివరకూ ట్రంప్ తో కలసి 7 గురు అమెరికా అధ్యక్షులు ఇండియా వచ్చారు. వారితో పాటు వారి భార్యలూ ఇండియా వచ్చారు. భార్యలను విదేశీ యాత్రలకు వెంటతీసుకెళ్లడం అమెరికా అధ్యక్షులకు అలవాటు. అయితే గతంలో ఇండియా వచ్చిన అధ్యక్షుల భార్యలు ఏం చేశారో తెలుసా.. ?

 

మొదటి ఇండియాకు వచ్చిన అమెరికా అధ్యక్షుడి భార్య జాక్వెలైన్‌ కెన్నడీ. ఆమె 1962లో భారత్‌ను సందర్శించారు. అప్పుడు కెన్నడీ రాలేదు. రాజస్థాన్‌లో ఒంటెపై సవారీ చేశారు. గంగా నదిలో పడవపై విహరించారు. ఇండియాలో ఎక్కువ కాలం గడిపిన అమెరికా అధ్యక్షుడి భార్యగా ఈమె రికార్డు సృష్టించారు.

 

ఆ తర్వాత రిచర్డ్‌ నిక్సన్‌ భార్యాభర్తలు 1969లో ఇండియాకు వచ్చారు. వీరు ఒక్కరోజు మాత్రమే మనదేశంలో ఉన్నారు. ఇండియాలో అతి తక్కువ కాలం ఉన్న రికార్డు వీరిది. అమెరికా అధ్యక్షుడు జిమ్మీకార్టర్‌తో కలిసి 1978లో భారత్‌ సందర్శించిన రోజలిన్‌ ఇక్కడ రెండు రోజులున్నారు. దక్షిణ దిల్లీకి సమీపంలోని ఛుమా ఖేరాగావ్‌ను సందర్శించారు.

 

1995లో హిల్లరీ క్లింటన్‌ భారత్‌లో మూడు రోజులు ఉన్నారు. అప్పుడు భర్త బిల్‌క్లింటన్‌ రాలేదు. కూతురు చెల్సియాతో కలిసి హిల్లరీ తాజ్‌మహల్‌ తోపాటు అనేక టూరిస్టు ప్లేసులకు వెళ్లారు. ఆ తర్వాత 1997లో కోల్‌కతాలో మదర్‌థెరెసా అంత్యక్రియలకు కూడా హిల్లరీ ఒంటరిగా వచ్చారు.

 

 

2006లో భారత్‌ వచ్చిన లారా బుష్‌ ఢిల్లీలో పర్యటించారు. ఓ పాఠశాలను, జీవన్‌జ్యోతి దివ్యాంగుల ఆశ్రమాన్నినోయిడాలోని ఫిల్మ్‌సిటీని సందర్శించారు. 2010లో భర్తతో పాటు ఇండియా వచ్చిన మిషెల్‌ ఒబామా ముంబయిలోని ఓ పాఠశాలలో పిల్లలతో కలిసి ఆడిపాడారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: