వైసీపీ ఎంపీ నందగం సురేష్ పై అమరావతి మండలం లేమల్లెలో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడి ఘటనపై ఆయన వివరణ ఇచ్చారు. తనను దారుణంగా దుర్భాషలాడారని తెలిపారు. ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే చూద్దాం.. 

 

" లేమల్ల వైపు వెళ్తుండగా కారు మారేందుకు ఆగాం. ఒక బస్సు వచ్చింది. కారుకు ఎదురుగా బస్సును ఆపి అందులో నుంచి మహిళలు దిగారు. వారంతా జై అమరావతి, జై సీబీఎన్‌ అంటూ నినాదాలు చేశారు. వారంతా జేఏసీ అని చెబుతున్నా..వాళ్లంతా కూడా టీడీపీకి చెందిన వారే. ఓ మహిళా వచ్చి ..అరే నీవు ఒక ఎంపీవా? ఏంట్రా..ఏమీ చేస్తార్రా..ఏమీ పీకుతార్రా..అంటూ దుర్భషలాడింది. అక్కడికి నేను సహనంతో అమ్మా..నీవు ఆడపిల్లవు..వదిలేయండి..నేను వెళ్తాను అంటూ కారు డోర్‌ తీసే ప్రయత్నంలో అటువైపు నుంచి మరో కొందరు మహిళలు చేతుల్లో కారం పొడి తీసుకొచ్చి చల్లారు. 

 


నా వెంట ఉన్న గన్‌మెన్లు అప్రమత్తమై..కళ్లు మూసి నన్ను కారులోకి ఎక్కించారు. నా వద్ద పీఏగా పని చేస్తున్న లక్ష్మన్నను కాలర్‌ పట్టుకొని కొట్టారు. వాళ్ల అన్నను చెప్పుతో దాడి చేశారు. ఇవన్నీ కూడా వీడియోలో ఉన్నాయి. ఆ ప్రాంతంలో అందరూ తిరుగుతున్నారు. నన్ను మాత్రమే టార్గెట్‌ చేశారు. ఏం ఖర్మ పట్టింది. కంట్లో కారం చల్లాల్సిన పనేముంది. టీవీ 5, ఏబీఎన్‌, ఈనాడుకు ఒక్కటే చెబుతున్నాను. నిజం మాట్లాడండి. మీరు అబద్ధాలు చెప్పబట్టే కదా చంద్రబాబుకు 23 సీట్లు వచ్చాయి. లేనిపోనివన్నీ కల్పించి అమరావతి ప్రజలను కూడా అలాంటి పరిస్థితికి తీసుకెళ్లే విధంగా ఉన్నారు. వాళ్లు అమరావతి ప్రజలు కాదు..వారికి అమరావతితో సంబంధమే లేదు. నిన్న తుళ్లూరు ప్రాంతంలో తిరిగాను. ఒక్క రైతు కూడా ఏమీ అనలేదు. మాకు ఏమైన ప్రయోజనం కలిగేలా చూడమని టీడీపీ నేతలే కోరారు. నిన్న దాడి చేసిన వారంతా కూడా టీడీపీ ఫెయిడ్‌ ఆర్టీస్టులే. రాత్రి 2 గంటలకు యూఎస్‌ నుంచి ఫోన్‌ చేసి నోటికి వచ్చినట్లు మాట్లాడారు. నీ అంతు చూస్తామని బెదిరించాడు. ఏం పిక్కుంటావో పిక్కోరా? జగన్‌ వచ్చి కాపాడుతారా? అంటూ బెదిరించాడు. మాపైనే దాడులు చేస్తే..ఒక సామాన్యులకు ఏ సందేశం ఇవ్వాలి. అంటూ వాపోయారు ఎంపీ సురేష్ .

మరింత సమాచారం తెలుసుకోండి: