ఒకసారి చరిత్రలోకి వెళితే ఫిబ్రవరి 25వ తేదీన ఎంతో మంది ప్రముఖులు జన్మించారు. మరి ఒక్కసారి చరిత్ర లోకి వెళ్లి చూసి ఈ రోజు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి . 

 

 సుప్రత బోస్  జననం : భారతదేశ 14వ పార్లమెంటు సభ్యులు అయినా సుభ్రత బోస్... 1932 ఫిబ్రవరి 25వ తేదీన జన్మించారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కి చెందిన ఈయన 14వ పార్లమెంటు సభ్యులుగా ఎన్నికయ్యారు. పశ్చిమ బెంగాల్లోని బరసత్ లోక్సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహించారు. ఈయన  2016 సంవత్సరంలో పరమపదించారు

 

 

 డాని డేంజోగ్బ   జననం :  సుప్రసిద్ధ భారతీయ సినీ నటుడు అయిన ఈయన  1948 ఫిబ్రవరి 25వ తేదీన జన్మించారు. హిందీతో పాటు పలు దక్షిణాది భాషలలో ఎన్నో సినిమాల్లో నటించారు. ఎక్కువగా ప్రతినాయక పాత్రలను రక్తి కట్టిస్తూ ఉంటాడు ఈయన.  దర్శకుడిగా కూడా కొన్ని సినిమాలను తెరకెక్కించారు. 

 

 

 దివ్యభారతి జననం : ఉత్తరాది నుండి తెలుగు సినీ పరిశ్రమకు వచ్చి మంచి నటిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన దివ్యభారతి 1974 ఫిబ్రవరి 25వ తేదీన జన్మించారు.  తెలుగు లో ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. నిర్మాత రామానాయుడు తన సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ చిత్రం బొబ్బిలి రాజా చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. ఇక ఈ సినిమాలో తన నటనకు తన అందం అభినయానికి దర్శక నిర్మాతలందరూ మరిన్ని సినిమాల్లో అవకాశాలు ఇచ్చారు. ఎన్నో సినిమాల్లో నటించి తనదైన నటనతో రక్తికట్టించారు దివ్యభారతి. తెలుగు  పరిశ్రమలో బాగా పేరు తెచ్చుకున్న నటీమణులలో దివ్యభారతి ఒకరు. దఈమె  1993 సంవత్సరంలో మరణించారు.

 

 

 గౌతమ్ మీనన్ జననం  : తమిళ దర్శకుడు నిర్మాత అయిన గౌతంమీనన్ 1973 ఫిబ్రవరి 25వ తేదీన జన్మించారు. యాక్షన్ థ్రిల్లర్  సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండేవారు గౌతమ్మీనన్. తమిళ భాషలో ఎన్నో యాక్షన్ థ్రిల్లర్ సినిమాలను తెరకెక్కించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళంలోని స్టార్ హీరోలందరితో ఈయన సినిమాలు తీశారు. ఇక ఎంతో మంది హీరోలకు బ్లాక్బస్టర్ విజయాలను అందించారు గౌతమ్మీనన్. తనదైన దర్శకత్వంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. 

 

 

 సమీర్ జనం : తెలుగు ప్రేక్షకులందరికీ నటుడు సమీర్ కొసమెరుపు. ఎన్నో చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రల్లో నటించి తనదైన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారూ.  అంతే కాకుండా ఎన్నో ధారావాహికలో కూడా నటించారు. ఋతురాగాలు కస్తూరి ఖుషి లాంటి ధారావాహికలో నటించిన సమీర్ ఇంద్ర సింహాద్రి శ్రీరామదాసు మాస్ సై అనసూయ మగధీర లెజెండ్ సరైనోడు లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఇక ఎన్నో టీవీ ప్రోగ్రాంలో కి కూడా వ్యాఖ్యాతగా వ్యవహరించారు సమీర్. సమీర్ 1973 ఫిబ్రవరి 25వ తేదీన విశాఖపట్నంలో జన్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: