నిన్నా మొన్నటి వరకూ ’విచారణ చేయించుకోండి ఎటువంటి విచారణకైనా మేమే సిద్ధం.. అవసరమైతే అరెస్టులకు కూడా వెనకాడేది లేదు.. దమ్ముంటే అరెస్టులు చేయండి’..  అని గర్జించిన చంద్రబాబునాయుడు, నారా లోకేష్ అండ్ కో నోళ్ళని ఒక్కసారిగా మూతపడిపోయాయి. చంద్రబాబు పాలనలో జరిగిన అవినీతిపై ప్రత్యేకంగా సిట్ విచారణ చేయిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుండి చాలామంది టిడిపి నేతల నోళ్ళు మళ్ళీ లేవలేదు.

 

అంతుకుముందే బయటపడిన వెయ్యి కోట్ల రూపాయల భారీ  ఇఎస్ఐ స్కాంలో మాజీ మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, పితాని సత్యానారయణతో పాటు నారా లోకేష్ పాత్రపై విపరీతమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాంతో చంద్రబాబు అండ్ కో కు ఒక్కసారిగా షాక్ కొట్టినట్లైంది. జరిగిన స్కాం కూడా రాష్ట్రపరిధిలోనిదే కావటంతో  వీళ్ళపై కేసులు పెట్టడం, అరెస్టులు చేయటం పెద్ద కష్టమేమీ కాదు. ఎందుకంటే ఇప్పటికే స్కాంపై విచారణ జరిపిన విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ రిపోర్టు ఇచ్చేసింది. అంటే రిపోర్టుపై చర్యలు తీసుకోవటమే మిగిలుంది.

 

ఈ విషయం బాగా అర్ధమవటంతోనే జరిగిన స్కాంను పక్కనపెట్టేసి అచ్చెన్న  బిసి కావటంతోనే కేసులు పెడుతున్నారనే పనికిమాలిన వాదనను తెరపైకి తెచ్చారు. అయితే అవినీతి చేయటానికి సామాజికవర్గానికి ఏమిటి సంబంధమని వైసిపి ఎదురుదాడి చేయటంతో టిడిపి నోళ్ళు మళ్ళీ లేవలేదు. దాంతో ఏమి మాట్లాడాలో అర్ధంకాని నేతలందరూ ఎక్కడ అడ్రస్ లేకుండా మాయమైపోయారు.

 

మొన్నటి వరకూ దమ్ముంటే కేసులు పెట్టుకోమని, విచారణలు చేయించుకోమన్నారు. అరెస్టులకు కూడా వెనకాడేది లేదంటూ పదే పదే సవాలు చేసి జగన్మోహన్ రెడ్డిని రెచ్చగొట్టారు.  అంటే ఇఎస్ఐ స్కాం బయటపడుతుందని అందులో అచ్చెన్న, పితాని తగులుకుంటారని చంద్రబాబుతో సహా ఎవరూ ఊహించలేదు. ఈరోజు కాకపోయినా రేపైనా వీళ్ళపై కేసులు, అరెస్టు తప్పదని నిర్ధారణ అయిపోవటంతోనే  పచ్చతమ్ముళ్ళెవరూ నోరిప్పటం లేదని వైసిపి రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డి ఎగతాళి చేస్తున్నారు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: