అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల భారత పర్యటనకు విచ్చేసిన నేపథ్యంలో మొట్ట మొదటి రోజు అతని ఆహ్వానానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చాలా అట్టహాసంగా జరిగాయి. అలాగే అగ్రరాజ్యపు అధ్యక్షుడికి గౌరవార్ధం రాష్ట్రపతి ఇస్తున్న విందుకు దేశంలోని రాజకీయ ప్రముఖులతో పాటు ఎనిమిది మంది ముఖ్యమంత్రులు, పారిశ్రామికవేత్తలు మరియు సినీ దిగ్గజాలు హాజరవుతున్న విషయం తెలిసిందే. అయితే సందర్భంగా పార్లమెంట్ లోని ప్రతిపక్ష నేతలను కూడా మోదీ సాదరంగా ఆహ్వానించాడు కానీ మోదీకి మాత్రం గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

 

రాష్ట్రపతి ఇస్తున్న విందుకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు మోడీ సర్కార్ నుండి ఆహ్వానం లభించినా కూడా ఆయన విందుకు హాజరు కావడం లేదు. మేరకు విందుకు రాలేకపోతున్నానని రాష్ట్రపతి కార్యాలయానికి సమాచారం ఇచ్చేసిన మన్మోహన్ సింగ్ దానికి తన ఆరోగ్య కారణాలను సాకుగా చూపించడం గమనార్హం. రాష్ట్రపతి కార్యాలయానికి మన్మోహన్సింగ్ మెసేజ్ వచ్చిన వెంటనే మోదీ సర్కారు అంతా షాక్ కు గురయ్యారు. ఎందుకంటే మన్మోహన్ రాలేకపోవడానికి అసలుకారణం వేరే ఉందని సమాచారం.

 

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఆహ్వానం అందకపోవడంతోనే మన్మోహన్ సింగ్ విందుకు దూరంగా ఉన్నాడట. తమ అధినేత్రి సోనియాను ఆహ్వానించకపోవడం అవమానమని.. ఆమె పాల్గొనకుంటే తాము ఎలా పాల్గొంటామని రాజ్యసభ కాంగ్రెస్ పక్ష నేత గులాంనబీం ఆజాద్ కూడా విందుకు దూరంగా ఉంటున్నట్టు తెలిసింది. ఇప్పటికే లోక్ సభ కాంగ్రెస్ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి కూడా తాను వెళ్లడం లేదని ప్రకటించారు.

 

 

ఇతర దేశాల అధ్యక్షులు భారత్ కు వస్తే ప్రతిపక్షాలతో సమావేశం నిర్వహించడం ఎప్పటినుంచో ఉన్న సంప్రదాయం కానీ బిజెపి దీనిని పక్కన పెట్టి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కావాలనే ఆహ్వానించకపోవడంతో కాంగ్రెస్ నేతలు హాజరు కాకపోతే సరికి మన్మోహన్ ముందు మోడీ కి తల కొట్టేసినట్లుంది. నేడు ట్రంప్ కు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కావాలనే ఆహ్వానం లభించినా విందుకు రాలేదని తెలిస్తే మన దేశం పరువు గంగలో కలిసినట్లే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: