ప్రపంచంలోనే అత్యంత వృద్దుడిగా జపాన్‌కు చెందిన చిటెట్సు వటనాబె(112) గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డుల్లోకెక్కిన విషయం తెలిసిందే. 112 సంవ‌త్స‌రాలుగా ఎంతో ఆరోగ్యంతో జీవిస్తోన్న ఆయ‌న తుదిశ్వాస విడిచారు. ఆయ‌న అంత్య‌క్రియ‌లు మంగ‌ళ‌వారం నిర్వ‌హించిన‌ట్టు గిన్నీస్ రికార్డు ప్ర‌తినిధులు వెల్ల‌డించారు. ఆయ‌న ఇటీవ‌లే 112 ఏళ్ల వయస్సులోనూ ఎంతో ఉత్సాహంతో నవ్వుతూ ఫొటో దిగ‌గా.. అది బాగా వైర‌ల్ అయ్యింది.



ప్ర‌పంచంలోనే వృద్ధ జ‌నాభా ఎక్కువ ఉన్న దేశంగా ఇప్ప‌టికే జ‌పాన్ రికార్డుల‌కు ఎక్కింది. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో యువ‌కులుగా ఉన్న వారు.. ఆ యుద్ధంలో పాల్గొన్న వారు ఇప్ప‌ట‌కీ జ‌పాన్‌లో చాలా మంది ఉన్నారంటే జ‌పాన్‌లో శ‌తాధిక వృద్ధులు ఎంత మంది ఉన్నారో అర్థం చేసుకోవ‌చ్చు. ఇక వ‌ట‌న‌బె ఇటీవ‌లే స్వ‌ల్ప అనారోగ్యానికి గుర‌య్యారు. గత కొన్ని రోజుల నుంచి జ్వరం, శ్వాసంబంధ సమస్యల కారణంగా వటనబె ఆహారాన్ని తీసుకోవ‌డం  లేదు.



ఇక 112 సంవ‌త్స‌రాల వ‌ట‌నాబే కుటుంబం చాలా పెద్ద‌దే కావడం విశేషం. ఆయ‌న‌కు మొత్తం ఐదుగురు సంతానం. ఇక ఈ ఐదుగురు సంతానానికి మొత్తం 12 మనవళ్లు, 17 ముని మనవండ్లు ఉన్నారు. గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డు ప్రతినిధుల వివరాల ప్రకారం చిటెట్సు వటనాబె 1907లో ఉత్తర జపాన్‌లోని నీగటాలో జన్మించారు. ఆయ‌న అగ్రిక‌ల్చ‌ర్‌లో గ్రాడ్యుయేష‌న్ కంప్లీట్ చేశారు. ఆయ‌న 18 సంవ‌త్స‌రాలు తైవాన్‌లో ఉన్నారు.



ఆయ‌న మిట్సు అనే మహిళను వివాహమాడగా వారికి ఐదుగురు పిల్లలు ఉన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తిరిగి తన స్వస్థలమైన నీగటకు చేరుకున్న అతను ప్రస్తుతం అక్కడే ఉంటున్నారు. ఈ వ‌య‌స్సులో కూడా త‌న పొలంలో కూర‌గాయ‌లు పండిస్తోన్న ఆయ‌న తాను ఈ వ‌య‌స్సులోనూ ఆరోగ్యంగా ఉండ‌డానికి కార‌ణం త‌న మొఖంపై ఎప్పుడూ చిరున‌వ్వు చెర‌గ‌నీయ‌క‌పోవ‌డ‌మే అని త‌న ఆరోగ్య ర‌హ‌స్యం చెపుతుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: