ఐదేళ్లు అధికారంలో ఉండి ఒక్కసారిగా దారుణ ఓటమికి గురైన టీడీపీ పాఠాలు నేర్చుకుంటున్నట్లు కనిపిస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు పెద్దగా నియోజకవర్గాల మొహాలు చూడని నేతలు, ఇప్పుడు ఇంటింటికి తిరుగుతున్నారు. జగన్ ప్రభుత్వం అన్నీ రకాలుగా విఫలమైందని చెబుతూ ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ ప్రయత్నాలు ఫలించి, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్‌కు ఏమన్నా నష్టం జరిగే అవకాశం ఉందా? అంటే లేదని చెప్పలేం.

 

2019 ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓడిపోయి 23 సీట్లకు పరిమితమైన విషయం తెలిసిందే. ఇక వారిలో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు జగన్‌కు జై కొట్టడంతో 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే జగన్ పాలన మొదలు పెట్టిన దగ్గర నుంచి, కొద్దోగొప్పో ఈ 21 మంది ఎమ్మెల్యేలు కాస్త యాక్టివ్ గానే ఉన్న, ఓడిపోయిన మిగిలిన నేతలు మాత్రం అడ్రెస్ లేరు. చంద్రబాబు ఏదో రకంగా జగన్ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న, వారు బయటకు రాలేదు. ఇక అలా చాలా రోజులు అడ్రెస్ లేని నేతలు, మెల్ల మెల్లగా బయటకొస్తూ, బాబుకు మద్ధతు ఇవ్వడం మొదలుపెట్టారు.

 

ఇప్పుడైతే జగన్ ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకిత వస్తుందనే భావనతో పాటు, స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఓడిన నేతలు నియోజకవర్గాల్లో తిరగడం మొదలుపెట్టారు. ఓ వైపు అధినేత ప్రజా చైతన్య యాత్ర ద్వారా రాష్ట్రమంతా తిరిగే ప్రయత్నం చేస్తుండగా, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇన్ చార్జ్‌లు నియోజకవర్గాల్లో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు కదిలారు.

 

ప్రతిరోజూ షెడ్యూల్ పెట్టుకుని నియోజకవర్గంలో కొన్ని ఊర్లు తిరుగుతూ, జగన్ ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాలని జనాలకు వివరిస్తున్నారు. అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి మద్ధతు తెలపాలని కోరుతున్నారు. అయితే ఇలా సడన్‌గా టీడీపీ నేతలు యాక్టివ్ అవ్వడం వల్ల, జగన్‌కు కాస్త ఇబ్బంది ఎదురవొచ్చు. లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో మరి ఎక్కువగా కాకపోయిన, ఓ మాదిరిగా వైసీపీకి నష్టం జరిగే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషుకులు అంచనా వేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: