అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రాంప్ గౌరవార్ధం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఇచ్చిన విందు కు ఎన్డీఏయేతర ముఖ్యమంత్రుల్లో ఒక్క కేసీఆర్ కే ఆహ్వానం లభించడం , ఆయన విందుకు హాజరుకావడం హాట్ టాఫిక్ గా మారింది . తెలంగాణ లోని  ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపధ్యం లో   కమలనాథులు ,  కేసీఆర్ ను  బద్ద శత్రువుగా భావిస్తున్నారు . కేసీఆర్ కూడా మాటకు ముందు బీజేపీపై ఒంటికాలిపై లేస్తున్నారు . ఈ తరుణం లో అగ్ర దేశాధ్యక్షుడి కి, భారత  రాష్ట్రపతి  ఇచ్చే విందుకు కేసీఆర్ కు ఆహ్వానం అందడం వెనుక మర్మం  ఏమిటన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు .

 

ట్రంప్ గౌరవార్ధం ఏర్పాటు చేసిన విందు లో పాల్గొనే  ఆహ్వానితుల జాబితాను రాష్ట్రపతి భవన్  తయారు చేసినప్పటికీ, దాని వెనుక  కర్మ , కర్త , క్రియ అంత బీజేపీ పెద్దలెనన్నది జగమెరిగిన సత్యమే . అటువంటిది రాజకీయంగా తమ కంట్లో నలుసు మాదిరిగా మారిన కేసీఆర్ ను ఏరికోరి ట్రంప్ గౌరవార్ధం ఏర్పాటు చేసిన విందుకు ఆహ్వానించడం వెనుక బీజేపీ రాజకీయ వ్యూహం ఏమిటన్నది
చర్చనీయాంశంగా మారింది . ఇటీవల  ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ జాతీయ నాయకత్వం తమ వ్యూహాన్ని మార్చినట్లు కన్పిస్తోంది . ప్రాంతీయ పార్టీలతో స్నేహాన్ని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది .  తాజా  రాజకీయాలను దృష్టి లో పెట్టుకుని బీజేపీ నాయకత్వం , కేసీఆర్ తో రాజకీయ స్నేహాన్ని కోరుకుంటుందా?, అదే నిజమైతే తెలంగాణలో టీఆరెస్ కు తామే ప్రత్యామ్నాయం  చెబుతోన్న కమలనాథులు ఇక తమ మాటలు కట్టిపెట్టాల్సిందేనా ? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి .

 

కేసీఆర్ పాలనా పై రాష్ట్రం లోని బీజేపీ నేతలు దుమ్మెత్తిపోస్తుంటే , కేంద్ర మంత్రులు   ఆయన పాలన కు కితాబిచ్చిన సందర్భాలు లేకపోలేదు . అదే విధంగా రాష్ట్ర బీజేపీ నాయకత్వం ప్రమేయం లేకుండానే కేసీఆర్ ను బీజేపీ జాతీయ నాయకత్వం ట్రంప్ విందుకు ఆహ్వానించే విధంగా చొరవ   తీసుకుని రాష్ట్రపతి భవన్ ను ప్రభావితం చేసిందా ? అన్న ప్రశ్న తలెత్తుతోంది . 

మరింత సమాచారం తెలుసుకోండి: