జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై  ప్రతిపక్ష ఎంఎల్ఏ ప్రసంశలు కురిపించారు. రాబోయే 20 సంవత్సరాలు జగనే పరిపాలించాలంటూ కాంగ్రెస్ ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి చెప్పటం సంచలనంగా మారింది. తిరుమలలోని శ్రీవారి దర్శనార్ధం తర్వాత  కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్ పాలన అద్భుతంగా ఉందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ బాటలోనే జగన్ కూడా పరిపాలన చేస్తున్నట్లుగా కోమటిరెడ్డి అభిప్రాయపడ్డారు.

 

సరే కోమటిరెడ్డి ఆశలు తీరుతాయా లేదా అన్న విషయాన్ని పక్కనపెట్టేద్దాం. రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతల్లో చాలామంది జగన్ పరిపాలనపై ఒకవైపు విరుచుకుపడుతున్నారు. దానికి తోడు కాంగ్రెస్ కు మిత్రపక్షమైన తెలుగుదేశంపార్టీ నేతలు జగన్ పాలనపై మండిపోతున్నారు.  అధికారంలోకి వచ్చిన నెల రోజుల నుండి చంద్రబాబునాయుడు అండ్ కో  జగన్ పరిపాలపై ఎంతస్ధాయిలో ఆరోపణలు, విమర్శలు, నిరశనలు చేస్తున్నది అందరూ చూస్తున్నదే.

 

తొమ్మిది నెలలు కూడా పరిపాలన పూర్తి కాకుండానే జగన్ పరిపాలనకు వ్యతిరేకంగా చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్ర మొదలైన విషయం అందరూ చూస్తున్నదే. నిజానికి జగన్ ప్రభుత్వంపై  చంద్రబాబు ఎంతగా బురద చల్లాలని ప్రయత్నిస్తున్నా సాధ్యం కావటం లేదు. చంద్రబాబు పాలనకు జగన్ పరిపాలనకు తేడాలు చూస్తే స్పష్టంగా కనిపిస్తోంది.  2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా సంపూర్ణంగా నెరవేర్చిన చరిత్ర చంద్రబాబుకు లేదు.

 

అదే సమయంలో మొన్నటి ఎన్నికల్లో కానీ అంతకుముందు పాదయాత్రలో కానీండి జగన్ ఇచ్చిన హామీల్లో చాలా వరకూ నెరవేరుస్తున్నారు. ఇప్పటి వరకూ అభివృద్ధికన్నా సంక్షేమానికే జగన్ పెద్ద పీట వేస్తున్నట్లు కనబడుతోంది. ఈ ఒక్క విషయంలోనే ఇబ్బంది కనబడుతోంది. అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటేనే  ఏ ప్రభుత్వమైనా సక్సెస్ అయినట్లు లెక్క. ఇపుడు గడచింది తొమ్మిది నెలలే అని గడవాల్సింది మరో 4 ఏళ్ళుందని చంద్రబాబుతో పాటు మిగిలిన ప్రతిపక్షాలు మరచిపోతున్నాయి. అందుకనే జగన్ పాలనపై  తాజాగా కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతోంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: