ఏపీ బీజేపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితి గందరగోళంగా ఉంది. జనసేనతో పొత్తు పెట్టుకున్న ఆ పార్టీ, ప్రజా ఉద్యమాలు, పోరాటాలు చేయడం ద్వారా వచ్చే ఎన్నికల నాటికి బలం పుంజుకోవాలని చూస్తోంది. ప్రస్తుతం ఉన్న స్పీడ్ కంటే మరింత స్పీడ్ గా ప్రజల్లోకి వెళ్లాలి అంటే ఏపీ బీజేపీ అధ్యక్షుడు మార్చాలని అధిష్టానం భావిస్తోంది. ఈ మేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఆ బాధ్యతలు అప్పగించినా ఆయన ఈ విషయంలో పెద్దగా ఆసక్తి చూపించకపోవడంతో ఎవరికి వారు ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి కోసం అధిష్టానం దగ్గర మార్కులు కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఏపీ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను తప్పకుండా అధిష్టానం మారుస్తుంది అనే ఆశలు మిగతా ఆశావాహుల్లో ఉంది.


 ఇప్పటి కే ఏపీ బిజెపి అధ్యక్ష పదవి కోసం కన్నా లక్ష్మీనారాయణ తో పాటు దగ్గుబాటి పురంధరేశ్వరి, సోము వీర్రాజు, ఎమ్మెల్సీ మాధవ్ ఇలా చాలా మంది తమ వంతుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కొత్త అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ మాధవ్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. దీనికితోడు మాధవ్ కు  ఆర్ఎస్ఎస్ అండ ఉండడంతో ఆయనకే తప్పకుండా అధ్యక్ష పదవి వస్తుందని ఎమ్మెల్సీ మాధవ్ తనకున్న ఆర్ఎస్ఎస్ బలంతో ఢిల్లీలో ఎక్కువగా లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మాధవ్ వ్యవహారం పై కన్న వర్గం గుర్రుగా ఉంది. పార్టీ ఏపీలో బలపడాలంటే ప్రధాన సామాజిక వర్గం అండ ఉన్న కన్నా లక్ష్మీనారాయణ కొనసాగించాలని మాధవ్ ను  అధ్యక్షుడుని చేస్తే పార్టీలో చీలిక వస్తాయని వారు చెబుతున్నారు.

IHG


 మాధవ్ కు  బిజెపి పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉండడం, ఆయన తండ్రి ఉమ్మడి రాష్ట్రంలో అధ్యక్షుడిగా పనిచేయడంతో పాటు, ఆర్ఎస్ఎస్ మద్దతు, ప్రస్తుత రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్ ల సపోర్టు ఉండడంతో మాధవ్ కు ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే కన్నా మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా అధిష్టానం మరోసారి అధ్యక్షుడిగా తననే కొనసాగిస్తుందనే నమ్మకంతో కోర్ కమిటీ, స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశాలు, జనసేనతో పొత్తు ఇలా అనేక విషయాల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. 


ఇక కన్నాకు అనుకూల వర్గం మాత్రం అధిష్టానం పెద్దల దగ్గర మరో రెండేళ్లపాటు అధ్యక్ష పదవి పొడిగించాలంటూ లాబీయింగ్ చేస్తున్నారు. ఒకవేళ ఏపీ బిజెపి అధ్యక్షుడు మార్చాలని అధిష్టానం బలంగా డిసైడ్ అయితే ఎమ్మెల్సీ మాధవ్ కే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: