ఈ మ‌ధ్య కాలంలో సెక్స్ కోసం ఏకంగా హ‌త్య‌లు ఆత్మ‌హ‌త్య‌లు జ‌రిగిపోతున్నాయి. క‌ట్టుకున్న భార్య‌ను సైతం అలాగే భ‌ర్త‌ను సైతం లెక్క చేయ‌కుండా వివాహేత‌ర సంబంధాలు కొన‌సాగిస్తున్నారు నేటి యువ‌త‌. చివ‌రికి శ‌వ‌మై తేలుతున్నారు. అర్ధాత‌రంగా వారి జీవితాల‌ను వారే ముగించేసుకుంటున్నారు. దీనంత‌టికి ప్ర‌ధాన కార‌ణం కేవ‌లం వివాహేత‌ర సంబంధాలు మాత్ర‌మే. ఇలాంటి దారుణ‌మైన ఘ‌ట‌నే ఒక‌టి క‌డ‌ప‌జిల్లాలో చోటుచేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే... 

 

కడప జిల్లాలోని టక్కోలి గ్రామ హరిజనవాడకు చెందిన సాల శ్రీనివాసులు (29)కు అదే ప్రాంతానికి చెందిన సుమతితో రెండున్నరేళ్ల కిందట వివాహమైంది. వీరికి 11 నెలల బాబు కూడా ఉన్నాడు. అయితే శ్రీనివాసులు కడపలోని ఓ నర్సింగ్‌ హోంలో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఇద్ద‌రి సంసారం సాఫీగా ఆనందంగ సాగుతుంది. ఇదే స‌మ‌యంలో... అదే నర్సింగ్‌ హోంలో నర్సుగా పనిచేసే సుజన అనే యువతితో శ్రీనివాసులుకు అక్రమ సంబంధం ఏర్ప‌డింది. విచ్చలవిడి శృంగారానికి అలవాటు పడిన ఆమె మరికొందరితోనూ లైంగిక సంబంధాలు పెట్టుకుంది. అయితే ఈ విషయం శ్రీనివాసులుకి తెలిసింది. దాంతో అత‌ను త‌ట్టుకోలేక ఒక‌ ఆమెను తరుచూ వేధించ‌డం మొద‌లుపెట్టాడు. 

 

ఇక ఇదిలా ఉంటే ఐదు రోజుల క్రిత‌మే ఆమెకు మ‌రో అబ్బాయితో నిశ్చితార్ధం జ‌రిగింది. అప్పటి నుంచి శ్రీనివాసులు, ఆ యువతి మధ్య  మురింత‌గా గొడవలు పెరిగాయి. తనను కాదని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటే చచ్చిపోతానని శ్రీనివాసులు ప్రియురాలిని బెదిరించ‌డం మొదులు పెట్టాడు. ఈ నేప‌ధ్యంలోనే సోమవారం ఉదయం 9 గంటలకు శ్రీనివాసులు ఆస్పత్రికి వచ్చాడు. రాత్రి విధులు ముగిసిన ఇంటికి వెళ్లే సమయంలో వీరిద్దరి మధ్య ఘ‌ర్ష‌న జ‌రిగింది. తనను కాదని వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఉరేసుకుని చస్తానంటూ ఆమెను బెదిరించాడు.

 

దీంతో అత‌ను త‌న పెళ్ళికి ఎక్క‌డ అడ్డు వ‌స్తాడో అని అత‌నికి ఉరి వేసి మ‌రీ చంపేసింది. ఎవ్వ‌రికీ అనుమానం రాకుండా మంచం మీద ప‌డుకోబెట్టి వెళ్లిపోయింది. ఇది చూసిన ఆసుప‌త్రి యాజ‌మాన్యం వారి కుటుంబ స‌భ్యుల‌కు, పోలీసుల‌కు స‌మాచారాన్ని అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారించ‌గా కుటుంబ‌స‌భ్యులు చ‌నిపోయేంత పిరికివాడు కాద‌ని అంత పెద్ద స‌మ‌స్య‌లు కూడా ఏమీ లేవ‌ని చెప్పారు. అయితే ఈ విచార‌ణ‌లో అత‌నికి న‌ర్సుతో అక్ర‌మ సంబంధం బ‌య‌ట‌ప‌డింది. ఇక ఆమెను అదుపులోకి తీసుకుని విచార‌ణ మొద‌లుపెట్టారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: