రెండు రోజుల పాటు భారత్ లో పర్యటించిన అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందు నరేంద్రమోడి ప్రభుత్వాన్ని చులకన చేసేందుకే ఆందోళనకారులు ఉద్దేశ్యపూర్వకంగా అల్లర్లు మొదలుపెట్టారా ? గ్రౌండ్ లెవల్లో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కేంద్రం అమలు చేద్దామని అనుకున్న పౌరసత్వ సవరణ చట్టంపై ఇంత హఠాత్తుగా ఆందోళనలు జరగాల్సిన అవసరం లేదు.

 

పైగా దేశంలో ఎక్కడా లేని ఈ ఆందోళనలు కేవలం ఢిల్లీలో మాత్రమే ఎందుకు జరుగుతున్నాయి ? అన్నదే అసలైన ప్రశ్న. పౌరసత్వ సవరణ చట్టం యావత్ దేశానికి అమలవుతుందే కానీ ఒక్క ఢిల్లీకి మాత్రమే ప్రత్యేకం కాదు కదా ? అయినా ఇంత హఠాత్తుగా ఢిల్లీలో అల్లర్లు మొదలయ్యాయంటే వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు అర్ధమవుతోంది. ట్రంప్ రెండు రోజుల పర్యటనకు వచ్చే ముందే అల్లర్లు మొదలవ్వటంతో అనుమానాలు మరింత పెరిగిపోతున్నాయి.

 

సరే ఏ కారణంతో అల్లర్లు మొదలైనా ఇప్పటి వరకూ దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోయారు.  ఢిల్లీ ఈశాన్య ప్రాంతంలోని మౌజ్ పూర్, చాంద్ బాగ్, కరవల్ నగర్, గోకుల్ పురి, భజన్ పురా, జఫరాబాద్ ఏరియాల్లో అల్లర్లు బాగా జరుగుతున్నాయి. ఎక్కడైనా అల్లర్లు మొదలైతే మామూలు జనాలైతే పోలీసులు రంగప్రవేశం చేయగానే చెల్లా చెదురైపోతారు. అదే ఆందోళనల వెనుక కుట్ర ఉంటే మాత్రం అల్లర్లు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి పాకుతుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. ఇపుడు జరుగుతున్నదదే.

 

అంటే మోడి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న వారే ఎవరో అల్లర్ల వెనుక ప్రముఖ పాత్ర పోషిస్తున్నట్లు అందరికీ అర్దమైపోతోంది. 144 సెక్షన్ విధించినా, కర్ఫ్యూ విధించినా అల్లర్లు తగ్గకపోవటానికి అంతా  ఓ ప్లాన్ ప్రకారం జరుగుతోందనేందుకు ఆధారాలుగా మారాయి. సరే ఈరోజు కాకపోయినా రేపైనా అల్లర్లకు కారకులను పోలీసులు పట్టుకోకపోరు. కాకపోతే ఈ లోగానే జరగాల్సిన డ్యామేజి జరిగిపోతోంది. ఇపుడు డొనాల్డ్ ట్రంప్ కూడా అమెరికాకకు వెళ్ళిపోయాడు కాబట్టి అల్లర్లు కూడా బహుశా ఒకటి రెండు రోజుల్లో ఆగిపోతాయేమో చూడాలి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: