దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న అల్లర్ల వెనుక పాక్ ఐఎస్ఐ హస్తముందని కేంద్ర ఇంటలిజెన్స్ ఏజెన్సీ తెలిపింది. ఇంటలిజెన్స్ ఏజెన్సీ తన రహస్య నివేదికలో భారత్ ను అపఖ్యాతి పాలు చేయాలనే ఉద్దేశంతో ఐఎస్ఐ అల్లర్లు రేపిందని పేర్కొంది. ఇంటలిజెన్స్ దేశంలో అస్థిరత రేపటానికి పాక్ ఐఎస్ఐ వెబ్ సైట్, సోషల్ మీడియా, స్లీపర్ సెల్స్, అండర్ వరల్డ్ కు నిధులను సమకూరుస్తుందని పేర్కొంది. 
 
తాజాగా ఒక కేసులో పాక్ నకిలీ కరెన్సీని దుబాయ్, నేపాల్ దేశాల ద్వారా భారత్ కు పంపించిందని తేలిందని ఇంటలిజెన్స్ పేర్కొంది. అండర్ వరల్డ్ నెట్ వర్క్ సహాయంతో పాక్ మన ఒరిజినల్ కరెన్సీని పోలిన కరెన్సీని ముద్రిస్తోందని దాన్ని మన దేశంలో చలామణీ చేస్తోందని ఇంటలిజెన్స్ చెబుతోంది. ఇంటలిజెన్స్ ఐఎస్ఐ అక్రమ ముస్లిం వలసదారులను, ఐఎస్ఐ అనుకూల సానుభూతిపరులను అల్లర్లు, హింసాకాండ సృష్టించేందుకు వినియోగించుకుంటోందని పేర్కొంది. 
 
ఐఎస్ఐ దేశంలోని ప్రధాన నగరాలలో ముస్లింలతో ఎన్నార్సీ, ఎన్‌పీఆర్, సీఏఏ సమస్యలపై నిరసనలు చేయటానికి నిధులను ఇస్తూ ప్రేరేపిస్తోందని ఇంటలిజెన్స్ పేర్కొంది. దేశ రాజధాని ఢిల్లీలో మాత్రమే కాక ఈశాన్య రాష్ట్రాల్లో, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల్లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా హింసాత్మక ఘటనలు జరిగాయి. ఇంటలిజెన్స్ వర్గాలు వాట్సాప్ గ్రూపులు, అనుమానాస్పద ఫోన్ కాల్స్ ను పరిశీలిస్తున్నాయి. 
 
ఇంటలిజెన్స్ ఢిల్లీలోని జాఫ్రాబాద్, శీలంపూర్, జామియానగర్ లలో జరిగిన అల్లర్లలో ఐఎస్ఐ పాత్రను పరిశీలిస్తోంది. మరోవైపు ఢిల్లీ హైకోర్టు ఈశాన్య ఢిల్లీలో చోటు చేసుకుంటున్న ఘటనలపై సీరియస్ అయింది. పోలీసులు హింసను అదుపు చేయటానికి కోర్టు ఆదేశాల కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదని పేర్కొంది. తాజా ఘటనలపై దాఖలైన పిటిషన్ల గురించి విచారణ జరిపి తాజా పరిస్థితుల గురించి నివేదిక ఇవ్వాలని పోలీస్ కమిషనర్ కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: