ఈ కాలంలో మట్టిలో మాణిక్యాల్లా బ్రతికే వారు ఎవరున్నారు.. ఎప్పుడు సందు దొరుకుతుందా అని గోతికాడి నక్కల్లా మాటువేసే మనుషులే నిండిపోయారు.. ఇది రాజకీయాల్లో అయితే మరీను.. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆపార్టీలోకి జంప్ చేయడం చాలా ఒంట బట్టించుకున్నారు.. ఇకపోతే ఈ కుళ్లు రాజకీయాల వల్ల సమాజం ఎంతలా పాడవుతుందో అందరికి తెలిసిందే... అవసరాలకోసం రాజకీయాలు.. సంపాదన కోసం పదవులు.. ఇదే కదా లోకంలో నడుస్తున్న తీరు..

 

 

ఇకపోతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రేస్ పార్టీని వీడేది లేదని డప్పు వాయించిన సుధీర్ రెడ్డి, ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున, ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసి గెలిచిన తరువాత ఆ పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరాడన్న విషయం తెలిసిందే... ఆయితే గులాభి కండువా కప్పుకున్న సుధీర్ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో రిజిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్​, ఇంటి పన్నులు, ఆటో నగర్ చెత్త డంపింగ్ సమస్య లాంటి ప్రధాన సమస్యలు పరిష్కరించేందుకే తాను టీఆర్​ఎస్​లో చేరుతున్నానని ఆ సందర్భంలో తెలియచేశారు..

 

 

ఇదే కాకుండా ఈ సమస్యలను  6 నెలల్లో పరిష్కరించకపోతే తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.. కానీ 8 నెలలు కావస్తున్నా చెప్పిన పనులు ఏమీ చేయకుండా.. ప్రజల నమ్మకాన్ని మూసీలో కలిపి మూసీ రివర్​ కార్పొరేషన్​ చైర్మన్​పదవి తెచ్చుకున్నారన్నారు. ఏ ఒక్క సమస్యకు పరిష్కారం చూపకుండా పదవి కోసం ప్రజలను మభ్యపెట్టడమే కాకుండా వారిని మోసం చేశాడు..

 

 

అందుకే ఈ ఎమ్మెల్యే కు చిత్తశుద్ది ఉంటే హామీలు తీర్చి పదవి చేపట్టాలని, లేని పక్షంలో బస్తీ నుంచి మొదలు ప్రతి డివిజన్​లో ఎమ్మెల్యే చేసిన మోసం గురించి వివరిస్తామన్నారు. ఇదే కాకుండా పట్నం గోసలో తన దృష్టికి వచ్చిన సమస్యలను ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందిస్తానని రేవంత్ రెడ్ది.. పై విధంగా, సుధీర్ రెడ్ది పై ధ్వజమెత్తారు..  

మరింత సమాచారం తెలుసుకోండి: