ఎన్నికల ప్రచారంలో ప్రజలకు హామీ ఇచ్చినవి, ఇవ్వనివి ఇలా అన్నిహామీలను జగన్ అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.  ప్రజల సంక్షేమమే తన అభిమతంగా అడుగులు వేస్తున్నారు. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి టిడిపి జీర్ణించుకోలేకపోతోంది. అందుకే తరచుగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ.. ప్రతి పథకాన్ని హేళన చేస్తోంది. జగన్ అధికారంలోకి వచ్చిన 9నెలల్లోనే తాను ఇచ్చిన హామీలన్నీ దాదాపుగా నెరవేర్చాడు. ఇక ఈ మార్చి నెలాఖరునాటికి పేదలకు అందించే ఇళ్ల స్థలాల కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. క్షేత్ర స్థాయిలో ఉన్న అన్ని సమస్యలను అధిగమిస్తూ తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే విధంగా ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే అన్ని గ్రామాల్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయంలో ఎటువంటి వివాదాలు లేకుండా భూ సేకరణ చేయగలిగారు. 

 

IHG

 

 దీనిపైన తెలుగుదేశం పార్టీ విమర్శలు మొదలు పెట్టింది. తెలుగుదేశం ప్రభుత్వంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇద్దామని చూసినా అది వర్కవుట్ కాలేదు. వైసీపీ ప్రభుత్వం కూడా అదే విధంగా మాట నిలబెట్టుకోలేదని టిడిపి భావించింది. కానీ జగన్ అన్ని సమస్యలను అధిగమించి ముందుకు వెళ్తున్నారు అయితే ప్రభుత్వం పై బురద చల్లాలని ఉద్దేశంతో పేదల భూముల్ని బలవంతంగా  వైసీపీ ప్రభుత్వం లాక్కుంటోందని, దళితులకు కేటాయించిన భూములను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది అంటూ టిడిపి, ఆ పార్ట్ అనుకూల మీడియా అదే పనిగా విమర్శలు చేస్తోంది. 


ఎక్కడా బలవంతంగా భూసేకరణ చేయొద్దని, అవసరమైతే కాస్త రేటు ఎక్కువైనా రైతులను ఒప్పించే భూ సేకరణ చేయాలని ఇప్పటికే స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. అతి తొందరలోనే లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు కూడా అందించబోతున్నారు. అదే జరిగితే ఇక వైసీపీ ప్రభుత్వానికి ప్రజల్లో ఇక తిరుగుండదు. ఇక తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై  పోరాటం చేసేందుకు కూడా ఎటువంటి కారణాలు కూడా ఉండవు.

మరింత సమాచారం తెలుసుకోండి: