2019 సార్వత్రిక ఎన్నికలలో భారీ మెజారిటీ సాధించింది బీజేపీ. 2014 ఎన్నికల కంటే ఎవరి అండ లేకుండా చాలా బలమైన ప్రభుత్వాన్ని కేంద్రంలో బిజెపి ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి తరుణంలో ఇటీవల పౌరసత్వ సవరణ చట్టం మరియు ఇంకా కొన్ని బిల్లులు తీసుకురావడంతో దేశవ్యాప్తంగా బీజేపీ పై వ్యతిరేకత మొదలయ్యింది. ఇందుమూలంగా ఇటీవల జరిగిన మూడు రాష్ట్రాల ఎన్నికలలో బిజెపి పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోవడం జరిగింది. దీంతో వెంటనే తేరుకున్న బిజెపి పెద్దలు పార్టీని బలోపేతం చేయడానికి కార్యాచరణ సిద్ధం చేశారు.

 

ఈ నేపథ్యంలో దక్షిణాదిలో తనకు అనుకూలంగా ఉండే నాయకులను దగ్గర చేర్చుకునే కార్యక్రమం బిజెపి ఇటీవల స్టార్ట్ చేసినట్లు అర్థమవుతుంది. విషయంలోకి వెళితే ఢిల్లీలో బిజెపి దారుణంగా ఓడిపోయిన తర్వాత రోజే వైసిపి అధినేత జగన్ కి అపాయింట్మెంట్ ఇచ్చిన మోడీ దాదాపు గంటకు పైగానే మాట్లాడటం జరిగింది. ఆ విషయం అలా ఉంచితే తాజాగా తెలంగాణ బిజెపి అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి ని రంగంలోకి దింపాలని బిజెపి పార్టీ పెద్దలు తీవ్రంగా ప్రయత్నాలు మీద ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా అధ్యక్షునిగా పార్టీకి ఓకే చెబితే కేంద్ర మంత్రి పదవి కూడా ఇవ్వడానికి బిజెపి రెడీ అయిందట. కానీ రేవంత్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలని డిసైడ్ అయినట్లు తెలంగాణ రాజకీయ వార్తలు వస్తున్నాయి.

 

ప్రస్తుతం రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ లో మల్కాజ్ గిరి పార్లమెంటు స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ని బిజెపి పార్టీలోకి తీసుకురావడానికి బిజెపి పవన్ కళ్యాణ్ ని ఉపయోగించడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. మేటర్ లోకి వెళ్తే రేవంత్ రెడ్డి నీ బిజెపి పార్టీలోకి తీసుకురావాలని ఒప్పించాలని పవన్ కళ్యాణ్ కి బీజేపీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇటీవల బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ పొత్తు కొనసాగుతుందని చెప్పటంతో ఈ బాధ్యత ని పవన్ కళ్యాణ్ కి బీజేపీ హైకమాండ్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో రాజకీయంగా అంతా ఓకే అయితే రేవంత్ రెడ్డి తో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: