2019 ఎన్నికల్లో దారుణ ఓటమి తర్వాత చాలామంది టీడీపీ నేతలు అడ్రెస్ లేకుండా వెళ్ళిపోయిన విషయం తెలిసిందే. అయితే చంద్రబాబు నిదానంగా జగన్ ప్రభుత్వంపై పోరాటం మొదలుపెట్టి, పార్టీని బలోపేతం చేసే కార్యక్రమం చేయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఒక్కో నేత బయటకు రావడం మొదలుపెట్టారు. ఇక ఇటీవల ప్రజా చైతన్య యాత్ర మొదలు పెట్టడం, స్థానిక సంస్థల ఎన్నికలు మొదలు కానుండటంతో చాలామంది నేతలు యాక్టివ్ అయ్యారు.

 

అయితే ఇంకా కొందరు నేతలు మాత్రం యాక్టివ్‌ కాలేదు. ముఖ్యంగా పార్లమెంట్ నియోకవర్గాల బరిలో పోటీ చేసి ఓడిపోయిన వారు అడ్రెస్ లేరు. ఏదో గెలిచిన ముగ్గురు ఎంపీలు పార్టీలో తిరుగుతున్నారు తప్ప, ఓడిపోయిన వారు మాత్రం కంటికి కనిపించడం లేదు. ఇక ఓడిపోయిన పార్లమెంట్ అభ్యర్ధుల్లో నెల్లూరుకు చెందిన బీదా మస్తాన్ వైసీపీలోకి వెళ్ళిపోయారు. అటు కడపలో ఓడిపోయిన ఆదినారాయణరెడ్డి బీజేపీలోకి వెళ్లారు.

 

ఇక వీరి బాటలోనే మరో పార్లమెంట్ అభ్యర్ధి కూడా టీడీపీకి గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. తిరుపతిలో పోటీ చేసి ఓడిపోయిన కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి బాబుకు షాక్ ఇవ్వొచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. అసలు కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన పనబాక మూడు సార్లు నెల్లూరు ఎంపీగా పోటి చేసి గెలిచారు. 2009లో బాపట్ల ఎంపీ పోటి చేసి గెలిచి, కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు.

 

తర్వాత రాష్ట్ర విభజన జరిగిన కాంగ్రెస్ నుంచే 2014లో పోటీ చేసి డిపాజిట్లు  కోల్పోయారు. ఇక కాంగ్రెస్ తో లాభం లేదు అనుకుని 2019 ఎన్నికల ముందు తన భర్త పనబాక కృష్ణయ్యతో కలిసి టీడీపీలోకి వచ్చి, తిరుపతి పార్లమెంట్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక ఓడిపోయిన దగ్గర నుంచి అడ్రెస్ లేని పనబాక ఫ్యామిలీ, టీడీపీకి దూరమయ్యే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతుంది. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో టీడీపీకి భవిష్యత్ కనపడకపోవడంతో ఆమె వైసీపీలోకి వెళ్ళే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: