ఒక అబద్ధాన్ని నిజమని జనాలను  నమ్మించటంలో తెలుగుదేశంపార్టీకి మించిన పార్టీ మరొకటి లేదన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రత్యర్ధులపై బురద చల్లాలని నిర్ణయించుకుంటే చంద్రబాబునాయుడు దగ్గర నుండి దిగువస్ధాయి నేత వరకూ ఒకే విషయాన్ని చెప్పిందే చెప్పి జనాలను భ్రమల్లో ముంచేస్తారు. అసలు వీళ్ళు చెబుతున్నది నిజమో కాదో క్రాస్ చెక్ చేసుకోవాలన్న ఆలోచన కూడా రానంతగా అబద్ధాలు చెప్పేస్తారు. ఎలాగూ మీడియా అండ ఉంది కాబట్టి ఒకటికి వందసార్లు వేసిందే వేసి చూసేవాళ్ళ బ్రైన్ వాష్ చేసేస్తారు.

 

ఇపుడిదంతా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనను తట్టుకోలేక అఖిల భారత సర్వీసు అధికారులు ఏపి నుండి కేంద్రానికి డిప్యుటేషన్ పై వెళ్ళిపోతున్నారు అని దాదాపు ఆరుమాసాలుగా ఊదరగొడుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే కేంద్ర హోంశాఖ తాజాగా ఇచ్చిన లెక్కలు చూస్తే నిజమేనా ? అనే అనుమానలతో పాటు కేంద్ర హోం శాఖే అబద్ధాలు చెబుతోందేమో అన్న అనుమానం కూడా వచ్చేస్తుంది.

 

ఇంతకీ విషయం ఏమిటంటే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అఖిల భారత సర్వీసు అధికారులు కేంద్రానికి వెళ్ళిపోతున్నారంటూ ప్రచారం చేస్తున్నారు. ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పాలంటూ  ఓ సామాజిక కార్యకర్త ఆర్టిఐ ద్వారా దరఖాస్తు చేసుకుని కేంద్ర హోంశాఖను  అడిగారు.  ఆ దరఖాస్తుకు కేంద్ర హోంశాఖ చీఫ్ ఇన్ఫర్మేషన్ అధికారి ఇచ్చిన రిప్లై చూస్తే ఆశ్చర్యమేస్తుంది.

 

జగన్ అధికారంలోకి వచ్చిన 2019 జూన్ నుండి ఇప్పటి వరకూ ఒక్క  సివిల్ సర్వీసు అధికారి కూడా డిప్యుటేషన్ కు వస్తామని కేంద్రానికి దరఖాస్తు చేసుకోలేదట. తమ వద్ద పెండింగ్ లో ఉన్న దరఖాస్తులన్నీ 2014-19 మధ్య వచ్చినవేనట. అంటే చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నపుడే ఏడుగురు అధికారులు డిప్యుటేషన్ వచ్చేస్తామని దరఖాస్తు చేసుకున్నట్లు స్పష్టంగా చెప్పారు.

 

చంద్రబాబు పాలనలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ ను తట్టుకోలేక, పోలవరం అవినీతిని భరించలేక, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహిరంచాలన్న చంద్రబాబు ఒత్తిళ్ళను తట్టుకోలేకే చాలామంది కేంద్రానికి వెళ్ళిపోయారు. అజయ్ సహానీ, గిరిధర్ లాంటి సీనియర్ ఐఏఎస్ లు అలా కేంద్రానికి వెళ్ళిపోయిన వాళ్ళే. అంటే ఇక్కడ గమనించాల్సిందేమంటే జరిగింది ఒకటైతే జరుగుతున్న ప్రచారం మరొకటని. ఎప్పుడైతే కేంద్ర హోంశాఖ రాత మూలకంగా సమాధానం ఇచ్చిందో అప్పటి నుండే టిడిపి నోళ్ళు మూతపడ్డాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: