తెలుగుదేశం పార్టీ నాయకులు ఇటీవల చాలా గట్టిగా అధికార పార్టీని టార్గెట్ చేయడం జరిగింది. అమరావతి ప్రాంతంలో దాడులు కావాలని వైసీపీ నేతలు చేస్తున్నారని టిడిపి ఆరోపించడం జరిగింది. అంతేకాకుండా ధర్నాలు దీక్షలు నిరసనలు చేస్తున్న రైతుల పై కారం జల్లి వైసిపి వ్యవహరిస్తుందని దాడులకు తెగ పడుతోందని విమర్శించడం మనం ఇటీవల చూశాం. ఇదే సమయంలో చంద్రబాబు తలపెట్టిన ప్రజా చైతన్య యాత్ర లో కూడా ఇదే రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. రాబోయే రోజుల్లో వైసీపీ నాయకులను ఎవరిని విడిచిపెట్టే ప్రసక్తి లేదని ప్రస్తుతం ఎలా అయితే వ్యవహరిస్తున్నారో అదే స్థాయిలో రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించుకునే పరిస్థితి ఉంటుందని పేర్కొనటం జరిగింది. కాగా తాజాగా టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ కూడా వైసిపి గవర్నమెంట్ ని గట్టిగా టార్గెట్ చేశారు.

 

విషయంలోకి వెళితే ఇటీవల మీడియా సమావేశంలో మాట్లాడిన నారా లోకేష్ ముఖ్యమంత్రి జగన్ పై సంచలన ఆరోపణలు చేశారు. స్మశానాలకు పార్టీ రంగులు వేసుకునే జీవితాలలో మార్పు ఎలా వస్తుందని అని ప్రశ్నించారు. చంద్రబాబు ఇచ్చిన ఇళ్ల పట్టాలకు, ఇళ్లకు వైసీపీ రంగులు వేసే కొత్త పథకాన్ని జగన్ తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు.

 

అయితే ఆ పథకానికి జగన్ మోసం రెడ్డి అని పేరు పెట్టుకున్నారని, టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు పేదలకు 5 లక్షలకుపైగా ఇళ్ల పట్టాలు ఇచ్చారు, దాదాపు 12 లక్షల మంది పేదలకు ఇళ్లు కట్టించారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఎన్నికల ప్రచారంలో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన తుగ్లక్ జగన్ గారు 25 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తామంటూ దళితులు, పేదల భూములు కొల్లగొడుతున్నారని, ప్రజల్ని ఇలా పథకాల పేరుతో మోసం చేస్తూ బిల్డప్‌ స్కీమ్‌లు ఎందుకు అని విమర్శలు చేయడం జరిగింది. చేసే పని తక్కువ బిల్డప్ ఎక్కువ అన్నట్టుగా నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని విమర్శించడం జరిగింది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: