టాలీవుడ్ లో చాలా మంది కొత్త హీరోలు వస్తూనే ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇస్తున్న తెలుగు హీరోలందరికీ ఎవరో ఒక హీరో ఇన్స్పిరేషన్ గా ఉంటారు అన్న విషయం తెలిసిందే. అంతటి గొప్ప వ్యక్తులను కావాలి... వారిలాగా చిత్ర పరిశ్రమలో రాణించాలని... ఒక హీరో ని ఆదర్శంగా తీసుకుని చిత్ర పరిశ్రమ లోకి వస్తూ ఉంటారు. ఇలా ప్రస్తుతం యువ హీరోలు అందరూ చిత్ర పరిశ్రమలోకి రావాలనుకుంటున్న వారు ఎక్కువగా ఆదర్శంగా తీసుకుని హీరో ఎవరు అంటే అందరికీ గుర్తొచ్చే పేరు మెగా స్టార్ చిరంజీవి. ప్రస్తుతం టాలీవుడ్ పెద్దగా... తెలుగు చిత్ర పరిశ్రమకు నిలువెత్తు రూపం గా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా... కష్టంతో పైకి వచ్చిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికీ మకుటం లేని మహారాజుగా తెలుగు చిత్ర పరిశ్రమను ఏలుతున్నారు మెగాస్టార్ చిరంజీవి.

 

 

 అందుకే యువ హీరోలు అందరూ మెగాస్టార్ చిరంజీవిని  ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. కేవలం సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన వాళ్లే కాదు సినిమా బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన హీరోలకు కూడా మెగాస్టార్ చిరంజీవి ఆదర్శంగా నిలుస్తారు. ఆయనలా కష్టపడి ఎదగాలని అనుకుంటారు. అయితే మెగాస్టార్ చిరంజీవితో పాటు ప్రస్తుతం యువ హీరోలు అందరూ మరో హీరో ని ఆదర్శంగా తీసుకుంటున్నట్లు  తెలుస్తోంది. ప్రస్తుతం ఏ యువహీరో నోట విన్న ఆ హీరో పేరే వినిపిస్తోంది. అయితే ఆ ఇన్స్పిరేషన్ గా ఉండే హీరో ఏదో సీనియర్ హీరో అనుకునేరు. యువ హీరోలకు ఆదర్శంగా నిలుస్తున్న హీరో కూడా ఓ యువ హీరో నే.

 

 

 ఇంతకీ ఆ హీరో ఎవరు అంటారా... నందమూరి నట వారసుడిగా  తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై... తెలుగు చిత్రపరిశ్రమ అనే  పుస్తకం లో తనకంటూ కొన్ని ప్రత్యేకమైన పేజీలు లిఖించుకున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం యువ హీరోలకు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి ఇప్పుడిప్పుడే ఎంట్రీ ఇస్తున్న యువ హీరోల అందరి నోట జూనియర్ ఎన్టీఆర్ పేరు ఎక్కువగా  వినిపిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ లాగా  నటన లో మేము కూడా రాణించాలని అనుకుంటున్నాము అని చెబుతున్నారు యువ హీరోలు. అందుకే తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు హీరోలందరికీ చిరంజీవితో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు,

మరింత సమాచారం తెలుసుకోండి: