ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయిన తరువాత తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగుతోంది. టీఆర్ఎస్ పార్టీకి పోటీనిచ్చే పరిస్థితిలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు లేవు. ఈ రెండు పార్టీలు రాష్ట్రంలో పుంజుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నా ఆశించిన స్థాయిలో ఫలితాలు మాత్రం రావడం లేదు. ఈ రెండు పార్టీలు రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. 
 
ప్రజల కోసం పోరాటాలు చేయడంలో ఈ రెండు పార్టీలు విఫలమవుతున్నాయి. 2014 సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ రాష్ట్రంలో బలంగా పాతుకుపోతూ ఉండగా కాంగ్రెస్, బీజేపీ ఇప్పట్లో బలపడటం కష్టమే అని ఆ పార్టీ నేతలే విశ్వసిస్తూ ఉండటం గమనార్హం. 2014లో బోటాబొటీ మెజారిటీతో గెలిచిన టీఆర్ఎస్ టీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో చేర్చుకుని టీడీపీకి రాష్ట్రంలో భవిష్యత్తు లేకుండా చేసింది. 
 
ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉంటుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ పరిపాలన గొప్పగా లేకపోయినా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న కొంత వ్యతిరేకతను అనుకూలంగా మలచుకోవడంలో విఫలమవుతున్నాయి. ఈ పార్టీలు టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నా ఆ నిర్ణయాలకు ప్రజలు మద్దతు పలకటం లేదు. కాంగ్రెస్, బీజేపీ పోరాటాలు చేయడం కంటే టీఆర్ఎస్ పార్టీ ఏవైనా తప్పులు చేస్తుందా...? ఆ తప్పులు ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి అని ఆలోచిస్తే మంచిది. 
 
తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ప్రజల మద్దతు లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. ఈ సమస్యను అధిగమిస్తే మాత్రం రెండు పార్టీలు రాష్ట్రంలో పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న తప్పులపై దృష్టి పెట్టి ఆ తప్పులను ప్రజల్లోకి తీసుకెళితే భవిష్యత్తులోనైనా ఈ పార్టీలు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.           
 

మరింత సమాచారం తెలుసుకోండి: