విపరీత కాలే వినాశ బుద్దే.. ఈ మద్య మనుషులు చేస్తున్న రసాయనిక ప్రయోగాల వల్ల పర్యావరణానికే కాదు.. కొత్త కొత్త వైరస్ లు పుట్టుకొచ్చి మనుషులకే అత్యంత ప్రమాదాంగా మారుతున్నాయి.  ఒకప్పుడు ప్రకృతి ప్రశాంతంగా పచ్చగా ఉండి ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండేవారు.  రాను రాను గాలి, నీరు ఎక్కడ చూసినా కలుషితంగా మారిపోతున్నాయి.  చైనాలో ప్రబలిన కరోనా వైరస్ ధాటికి అక్కడ దాదాపు మూడు వేల మంది మరణాలకు చేరువ అయ్యారు.  వేల మంది ఈ వైరస్ భారిన పడ్డారు.  తాజాగా ఈ వైరస్ ప్రభావం ప్రపంచ దేశాలకు పాకిపోయింది. 

 

ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఏపి, తెలంగాణలో కొత్తరకం వైరస్ కంటిమీద నిద్ర లేకుండా చేస్తుందని అంటున్నారు. ఇప్పుడు ‘రుగోస్ వైరస్’ అనే కొత్త వైరస్ పండ్ల తోటలను నాశనం చేస్తోంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.  మరో విషయం ఏంటంటే.. మన దేశంలో మొదటి కరోనా కేసును కనుగొన్నది కేరళలోనే.. ఇప్పుడు ఈ రుగోస్ వైరస్‌ని కనుగొంది కూడా కేరళలోనే. కరోనా వైరస్ మనుషులపై ప్రభావం చూపుతుంటే, రుగోస్ వైరస్ పంటలపై ప్రభావం చూపిస్తోంది.  మొదటి ఈ వైరస్ ను కేరళలో కనుగొన్నారు.  అక్కడి నుంచి ఈ వైరస్ తమిళనాడు మీదగా ఆంధ్రప్రదేశ్ కు వచ్చింది.  ఏపీలో మొదట గోదావరి, కృష్ణా,విశాఖ, విజయనగరం జిల్లాలోని కొబ్బరి, పామాయిల్,పండ్లతోటలపై ప్రభావం చూపింది. 

 

ఈ వైరస్ దెబ్బకు పంటలు నాశనమవుతున్నాయి.  రుగోస్ వైరస్ అత్యంత డేంజరస్‌‌గా వ్యాప్తి చెందుతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఇది తెల్లదోమ వల్ల సోకుతుందట. ఈ తెల్లదోమలు మొక్కలోని, చెట్లలోని రసాన్ని పీల్చివేస్తుంది. ఫలితంగా చెట్లు ఎండుపోయి, కొమ్మలు రాలడం ప్రారంభమవుతుంది. అరటి, జామ, సీతాఫలం పండ్ల తోటలకు ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందని.. దీంతో రైతులు జాగ్రత్తలు పాటించాలని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.   అలాగే తోటల్లో ఎలాంటి మార్పులు వచ్చినా.. స్థానిక అధికారులకు తెలపాలని శాస్త్రవేత్తలు సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: