తెలుగుదేశం పార్టీ అధినేత ప్రతిపక్షనేత చంద్రబాబు విశాఖపట్టణంలో అదిరిపోయే షాక్ తగిలింది. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఉత్తరాంధ్రలో పర్యటన చేయాలని అనుకున్న చంద్రబాబుకి దిమ్మతిరిగి పోయినట్లు విశాఖ ప్రజలు అడ్డుకోవడం జరిగింది. దీంతో విశాఖపట్నం విమానాశ్రయం బయట రోడ్డుపైనే చంద్రబాబు బైఠాయించి నిరసన తెలిపారు. ఇది కావాలని వైసిపి కార్యకర్తలు నాయకులు చేస్తున్న పని అన్ని పక్కన ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రతిపక్ష నేతగా రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పర్యటించే హక్కు లేదా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్న కామెంట్ల పై మంత్రి అవంతి శ్రీనివాస్ రియాక్ట్ అయ్యారు. చంద్రబాబు గత ఆరు నెలలుగా ప్రవర్తిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.

 

విశాఖ పట్ల చంద్రబాబు అనుసరిస్తున్న వైనంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని అన్నారు. విశాఖకు సముంద్రం ఉందని ఒకసారి,తుపానులు వస్తాయని మరోసారి విషం కక్కి, ఈ నగరానికి వ్యతిరేకంగా ప్రచారం చేశారని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు అమరావతిపై మక్కువతో విశాఖ ప్రజలను,ఉత్తరాంద్ర ప్రజలను అవమానిస్తున్నారని అన్నారు. చంద్రబాబు పెళ్లికి వస్తే అభ్యంతరం లేదని, కాని రెండు రోజుల పాటు ఇక్కడి ప్రజలను రెచ్చగొట్టేలా ప్రకటనలు చేశారని ఆయన అన్నారు.

 

ఇందుమూలంగా విమానాశ్రయంలో విశాఖ ప్రజలు టైం చూసి చంద్రబాబుకి అదిరిపోయే షాక్ ఇచ్చారని అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో విశాఖ లో ఉన్న టిడిపి నాయకులు భూములను దోచుకున్నారని మంత్రి అవంతి ఆరోపించారు. మొత్తంమీద ఉత్తరాంధ్ర ప్రాంతానికి ద్రోహం చేసినందుకు చంద్రబాబు ని విశాఖ ప్రజలు అడ్డుకున్నారని చంద్రబాబుకి ఇది జరగాల్సిందే అని విమర్శలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: