సేమ్ టు సేమ్. అప్పుడు జగన్మోహన్ రెడ్డి విశాఖ విమానాశ్రయంలో ఏమైందో ఇపుడు చంద్రబాబునాయుడుకు కూడా అదే అయ్యింది. కాకపోతే అప్పట్లో చంద్రబాబు వైఖరికి నిరసనగా  జగన్  విమానాశ్రయం రన్ వే మీదే కూర్చున్నారు. ఇపుడు జగన్ వైఖరికి నిరసనగా అదే చంద్రబాబు విమానాశ్రయం బయటకు వచ్చి కూర్చున్నారు. అప్పట్లో చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు జగన్ ను డీటైన్ చేస్తే ఇపుడు జగన్ అధికారంలో ఉన్నారు కాబట్టి చంద్రబాబును నిలిపేశారంతే.

 

ప్రత్యేకహోదా ఆందోళనలకు మద్దతుగా 2017, జనవరి 26న జగన్ విశాఖపట్నంకు వచ్చారు. అప్పుడూ ఆందోళనల్లో పాల్గొనేందుకు అవసరమైన అన్నీ అనుమతులు తీసుకునే జగన్ హైదరాబాద్ నుండి విశాఖపట్నం చేరుకున్నారు. తీరా వచ్చిన తర్వాత ఎయిర్ పోర్టులో జగన్ ను పోలీసులు ఆపేశారు. కారణాలు చెప్పమంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ అని చెప్పారంతే.  మరి ముందుగా అనుమతులు ఎందుకు ఇచ్చారంటే పోలీసులు సమాధానం చెప్పలేదు.

 

ఇపుడు కూడా రెండు రోజుల పర్యటనకోసం చంద్రబాబు ఉత్తరాంధ్రకు వస్తున్నట్లు పోలీసులకు ముందుగానే చెప్పారు. దానికి పోలీసులు ఓకే చెప్పారు. తీరా ఎయిర్ పోర్టుకు చేరుకున్న తర్వాత చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. కాకపోతే బందోబస్తుగా పోలీసులు వస్తే  నిరసన తెలిపేందుకు వైసిపి కార్యకర్తలు కూడా చేరుకున్నారు. దాంతోనే సమస్య మొదలైపోయింది. విశాఖపట్నంను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకిస్తుండటమే వైసిపి కార్యకర్తల నిరసనకు ప్రధాన కారణం.

 

అయితే ఇక్కడే చంద్రబాబుకు, జగన్ కు తేడా స్పష్టంగా కనబడుతోంది. చంద్రబాబు ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం, ప్రచారం కోసమే ఉపయోగించుకుంటారు. ఇపుడు జరిగింది, చంద్రబాబుకు కావాల్సింది కూడా ఇదే. తనకు మద్దతుగా నిలబడే మీడియాలో తన నిరసనకు విస్తృత ప్రచారం వచ్చేట్లు చూసుకున్నారు. అదే జగన్ మాత్రం అప్పట్లో ఈ విధమైన ప్రచారానికి కక్కుర్తి పడలేదు. జగన్ పై దుమ్మెత్తిపోయటానికి చంద్రబాబుకు టిడిపి నేతలకు కావాల్సినంత మ్యాటర్ దొరికింది.  ఎన్ని రోజులు రెచ్చిపోతారో చూడాలి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: