కొన్ని కొన్ని సార్లు చెడు జరిగిన మన మంచికే.. ఎందుకంటే? కొన్ని కొన్ని సార్లు అనుకోని రీతిలో కొన్ని దారుణమైన ఘటనలు జరుగుతుంటాయి.. అందులో పెళ్లి ఘటనలు ఒకటి.. పెళ్లి కొడుకు నీచుడు.. పోకిరి వెధవ.. ఇవి అన్ని తెలియక అమ్మాయికి పెళ్లి చేస్తారు.. పట్టుమని 16 రోజులు కూడా అవ్వకముందే వాడిని భరించలేక పుట్టింట్లో పడుతుంది. 

 

అదే.. పెళ్లికి ముందే ఆ నీచ పెళ్లి కొడుకు వక్రబుద్ధి బయటపడితే.. అబ్బబా.. ఆ పెళ్లికూతురు అంత అదృష్టవంతురాలు మరొకరు ఉండరు అంటే నమ్మండి.. వాడి దుర్బుద్ధి బయటపడి.. మళ్లీ మంచి సంబంధం వెతికి తీసుకొచ్చి మంచివాడికి ఇచ్చి పెళ్లి చేస్తారు.. ఇప్పుడు అలానే ఓ పెళ్లికూతురు జీవితం ఓ వెదవ పోకిరి పెళ్ళికొడుకు నుండి బయటపడింది. 

 

ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లాలో అవనిగడ్డకు చెందిన యువతితో గుంటూరు జిల్లాకు చెందిన యువకుడికి పెళ్లి కుదిరింది. రెండు కుటుంబాల సమక్షంలో నిశ్చితార్థం కూడా జరిపించారు. ఇక అంతే ఆ యువతికి మాటకు ఫోన్ చెయ్యడం.. మెసెజ్ చెయ్యడం.. ఒంటరిగా కలవమనడం చేసాడు. 

 

అయితే పెళ్లి కుదిరింది కాబట్టి ఆ యువతీ కూడా అతినితో కలిసి తిరిగింది.. అయితే ఆ పెళ్లి కొడుకు కోరికలు ఎక్కువ అయ్యాయి.. కలిసిన ప్రతిసారి అసభ్యంగా ప్రవర్తించాడు.. దీంతో ఆ యువతీ అతన్ని దూరం పెట్టింది.. పెళ్ళికి ముందే అది కావాలంటూ ఆ యువతిని టార్చర్ చేశాడు. 

 

దీంతో ఆ యువతీ అతని నిజస్వరూపం తెలుసుకొని తల్లితండ్రులకు చెప్పి జరిగిన నిశ్చితార్థం రద్దు చూపించింది. దీంతో కక్ష పెంచుకున్న అతను వారు ఇద్దరు కలిసి తిరిగిన ఫోటోలు.. వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి బ్లాక్ మెయిల్ కి దిగాడు.. దీంతో ఆ యువతి పోలీసులను ఆశ్రయించి అతన్నీ జైల్లో పెట్టించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: