ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుని పోలీసులు హైదరాబాద్ తరలించారు. సెక్షన్ 151 కింద నోటీసులు ఇచ్చిన పోలీసులు... ఆయనను అరెస్ట్ చేసారు. ముందు విజయవాడ పంపించాలని భావించినా సరే విమానం అందుబాటులో లేకపోవడంతో హైదరాబాద్ పంపించారు. చంద్రబాబుని బలవంతంగా హైదరాబాద్ విమానం ఎక్కించారు అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రజల కష్టాలు వినేందుకు తాను విశాఖలో పర్యటిస్తా అని ముందు పట్టుబట్టిన చంద్రబాబు ఇప్పుడు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. 

 

ముందు నుంచి పోలీసులు పర్యటన రద్దు చేసుకోవాలని సూచిస్తూనే ఉన్నారు. అయినా వినకుండా పాదయాత్ర చెయ్యాలని చూడగా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీనితో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసారు. విమానం ఎక్కే ముందు పార్టీ నేతలు, సీనియర్లతో చంద్రబాబు విమానాశ్రయంలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వాళ్ళు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో యాత్ర కష్టమని చెప్పారు. వాళ్ళతో సమావేశం అనంతరం చంద్రబాబు వెనక్కు తగ్గారు. అయితే పోలీసులకు చంద్రబాబు సహకరించినా మీడియా ముందు మాత్రం టీడీపీ నేతలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. 

 

ఇక చంద్రబాబుని పంపించడం తో వాళ్ళు తిరిగి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. ఏ చట్టం కింద తనను వెనక్కు వెళ్ళమన్నారని ప్రశ్నించిన చంద్రబాబు పర్యటన కొనసాగిస్తా అని మొండికేసుకుని కూర్చున్నారు. భద్రత దృష్ట్యా ఇప్పుడు పర్యటన వద్దని పోలీసులు చెప్పినా ఆయన ముందు వినలేదు. ఇక ఇదిలా ఉంటే ఉదయం నుంచి చంద్రబాబు పర్యటనను అక్కడి ప్రజలు అడ్డుకున్నారు. ఉత్తరాంధ్ర ద్రోహి చంద్రబాబు అంటూ ఆరోపణలు, నినాదాలు చేసారు. మహిళలు, యువకులు, విద్యార్ధులు పెద్ద ఎత్తున చంద్రబాబు పర్యటనకు అడ్డు తెలిపారు. కోడి గుడ్లు టమాటాలతో ఆయన కాన్వాయ్ మీద దాడులకు దిగారు. ఆ సమయంలో వైసీపీ కార్యకర్తలకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం జరిగింది. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: