చంద్రబాబు విశాఖ పర్యటన ఉద్రిక్తతలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఆయన విశాఖ వెళ్తున్నది ప్రజలను కలుసుకునేందుకు అని టీడీపీ ప్రచారం చేసింది. ఇప్పటికే చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర పేరిట జనంలో తిరుగుతున్నారు. విశాఖలోనూ అలాంటిదే ఏర్పాటు చేశారని జనం అనుకున్నారు. కానీ అది కాదట. అసలు చంద్రబాబు విశాఖ వస్తున్నది ప్రజల కోసం కానేకాదట.

 

ఆయన ఉత్తరాంధ్ర ప్రాంతంలోని ఓ రెండు పెళ్లిళ్లకు వెళ్తున్నారట. ఎలాగూ వెళ్తున్నాం కదా.. కాస్త పొలిటికల్ మైలేజీ వస్తుందని ప్రజా చైతన్య యాత్ర పెట్టారట. ఈ విషయాన్ని వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాకు చెప్పారు. ప్రశాంతంగా ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాల్లో చంద్రబాబు ఆయన తాలుక రాజకీయ స్వార్థం కోసం చేస్తున్న ఒక దురాచారమైన విధానం, మాటలతో రెచ్చగొడుతూ చేస్తున్న కార్యక్రమాలు ప్రజలంతా చూస్తున్నారన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఉత్తరాంధ్ర జిల్లాల్లో చంద్రబాబు పర్యటన అంటూ విశాఖలో ఆయన తోడళ్లుడి తమ్ముడి కూతురు తాలుక వివాహం, టీడీపీ నాయకుడు అయ్యన్న పాత్రుడి ఇంట్లో శుభకార్యంలో పాల్గొనేందుకు వెళ్లేందుకే విశాఖ వచ్చారన్నారు.

 

కానీ ఆ విషయం చెప్పకుండా చంద్రబాబు చేస్తున్న ప్రకటనలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ఉత్తరాంధ్ర ప్రజలను చులకనభావంతో, హేళనగా మాట్లాడుతున్నారన్నారు మంత్రి బొత్స. ఆయన మాటలు వింటే ఎంతో బాధగా ఉంటుంది. వెనుకబాటుతనంతో ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాలను, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ జిల్లాను సీఎం వైయస్‌ జగన్‌ ఎగ్జిక్యూటీవ్‌ క్యాపిటల్‌గా ప్రకటించారు. చంద్రబాబు తన అక్కసు..ఆ ప్రాంతం అభివృద్ధి చెందకూడదని, ఇంకా వెనుకుబాటుతనంతో ఉండాలని, ఆయన అడుగులకు మడుగులు ఒత్తాలని ఆలోచన చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి బొత్స.

 

ఉత్తరాంధ్ర ప్రజలను ఉన్మాదులు అంటున్నారు. అసలు ఉన్మాది చంద్రబాబు కదా?. పోలీసులతో ఇలాగేనా వ్యవహరించేది. మూడుసార్లు సీఎంగా చేసిన వ్యక్తి పోలీసులతో ఎలా వ్యవహరించాలో ఆయనకు తెలియదా? ఏంటీ..ఈ అరాచకం. నీ పార్టీ రౌడీలను, గుండాలను పెట్టుకొని అక్కడ అల్లర్లు సృష్టించి, శాంతిభద్రతలకు విఘాతం కల్గించడమేనా నీ ధ్యేయం. ఎవరైనా ఒక శుభకార్యానికి వెళ్తే..ఆ ప్రాంతంలో ఉన్న పరిస్థితులను అంచనా వేసి మాట్లాడాలి. కానీ చంద్రబాబు ఏం చేస్తున్నారు. ఆయన సామాజిక వర్గం కోసం ఎదుటి వారిని దూషించడం సరికాదు... అంటూ ఓ రేంజ్ లో చంద్రబాబుపై ఫైర్ అయ్యారు మంత్రి బొత్స.

మరింత సమాచారం తెలుసుకోండి: