మహిళల కు రక్షణ లేకుండా పోతుందన్న విషయం తెలిసిందే..  సొంత ఇంట్లో కూడా రక్షణ లేకుండా పోతుంది. భర్త, అన్న, చివరి కి తండ్రి చేతుల్లో కూడా రక్షణ లేకుండా పోతుంది.. తాగు బోతు అయిన భర్త భార్యపై అనుమానం పెంచుకొని నానా హంగామా చేసాడు. వివరాల్లోకి వెళితే.. భార్యపై అనుమానం పెంచుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఛత్తీస్‌గఢ్‌ లో వెలుగు చూసింది. బలరామ్-రామానుజ్‌గంజ్ జిల్లా సామ్రీ పోలీస్ పరిధిలో ని తతిజారియా గ్రామానికి చెందిన తేజు నగేశ్అనే వ్యక్తి భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు.

 

 


అయితే.. మద్యాని కి బానిసైన తేజు కుటుంబాన్ని పట్టించుకోకుండా జులాయి గా తిరుగుతున్నాడు. దీంతో అతడి భార్యే కుటుంబాన్ని భారం గా నెట్టుకొస్తోంది. ఆదివారం గ్రామంలో వారపు సంతకు భార్య వెళ్లింది. అదే సమయంలో భారీ వర్షం కురవడం తో చాలా సేపు సంతలోనే ఉండిపోయింది. అలా వర్షం పూర్తిగా ఆగాక ఇంటికి వెళ్లిన భార్యను అనుమానించాడు. 

 

 


మద్యం మత్తులో ఉండటంతో రాత్రివేళ భార్య, పిల్లలపై అఘాయిత్యానికి పాల్పడతాడేమోనన్న భయంతో అతడిని ఒంటరిగా వదిలేశారు. దీంతో అతడి భార్య పక్కనే ఉండే జగన్మోహన్‌ ఇంట్లోను, పిల్లలు అదే గ్రామంలో ఉండే అమ్మమ్మ ఇంట్లోను పడుకున్నారు. సోమవారం ఉదయం నిద్రలేచిన తర్వాత స్ధానికులు తేజుకు నచ్చజెప్పి భార్యను పంపిద్దామని ఇంటికి వెళ్లారు.

 

 

తలుపు దగ్గరకు వెళ్లి ఎన్నిసార్లు పిలిచినా పలుకక పోవడంతో  కిటిలోంచి తొంగి చూసారు. అయితే వారు షాక్ అయ్యారు. ఫాన్ కు ఉరివేసుకొని వేలాడుతూ కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. కాసేపటికే పోలీసులు అక్కడికి చేరుకుని తేజు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. దంపతుల మధ్య తగాదాను తీరుద్దామనుకున్న స్థానికులు తేజు మరణించిన విషయాన్నీ తెలుసుకొని దుఖః సాగరంలో మునిగారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: