చైనాలో వుహాన్ లో పుట్టిన కరోనా వైరస్ కారణంగా ఎంతోమంది మరణించిన సంగతి తెలిసిందే.. ఈ వైరస్ ప్రపంచాన్ని మొత్తం వణికించేస్తోంది.. ఇప్పటికి రోజురోజుకు కరోనా వైరస్ భాదితులు పెరుగుతూనే ఉన్నారు. అలాంటి ఈ వైరస్ నుండి భారతీయులును కాపాడేందుకు భారత్ ప్రత్యేక విమానాలను చైనాకు పంపి భారత్ కు తీసుకువచ్చింది.    

 

కానీ ఆంధ్రకు చెందిన ఓ మహిళ మాత్రం చైనాలోని వుహాన్‌లోనే చిక్కుకుపోయింది.. అప్పటి నుండి ఆమె సోషల్ మీడియా వేదికగా ఆమెకు కరోనా రాలేదు అని తిరిగి భారత్ కు తీసుకువెళ్లండి అని ఆమె అడిగిన సంగతి తెలిసిందే. అయితే ఎట్టకేలకు ఇన్నాళ్లకు జ్యోతిని భారత్ కు తిరిగి తీసుకొచ్చారు.

 

ఈ విషయాన్నీ జ్యోతితో పాటు ఇండియన్‌ ఎంబీసీ అధికారులు నిర్ధారించినట్టు ఆమె కాబోయే భర్త అమర్‌నాథ్‌రెడ్డి తెలిపారు. భారత్ నుండి మిలిటరీ ట్రాన్స్‌పోర్ట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ వస్తుందని వుహాన్‌లో చిక్కుకున్న భారతీయులు అందరూ బయలుదేరేందుకు సిద్ధంగా ఉండాలని భారతీయులకు కేంద్ర ఆరోగ్య, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల నుంచి మెసేజ్‌లు వెళ్లాయి. 

 

ఈ నేపథ్యంలోనే చైనా నుండి ప్రత్యేక విమానంలో గురువారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడ అబ్జర్వేషన్‌లో కొన్ని రోజులు ఉంచి, ఆ తర్వాత వారిని ఇంటికి పంపనున్నారు. కాగా ఉద్యోగ శిక్షణ నిమిత్తం వుహాన్ వెళ్లిన జ్యోతి కరోనా వైరస్ కారణంగా అక్కడే చిక్కుకుపోయి దాదాపు నెల రోజుల నుండి ఓ డార్మెటరీలో ఉంటున్నారు. ఎట్టకేలకు నిన్న భారత్ కు తిరిగి వచ్చారు.

 

కాగా ఆమెను భారత్ కు తిరిగి తీసుకొచ్చేందుకు.. ఆమె తల్లి.. కాబోయే భర్త అమర్‌నాథ్‌రెడ్డి, బావ సురేకుమార్‌రెడ్డిలు పలువురు రాజకీయ నాయకులను కలిసి సహాయాన్ని కోరారు.. చివరికి ఇలా జ్యోతి క్షేమంగా భారత్ కు తిరిగి వచ్చేసింది.        

మరింత సమాచారం తెలుసుకోండి: