సర్ సివి రామన్ అనగానే మనకు రామన్ ఎఫెక్ట్ గుర్తుకు వస్తుంది.  1928 ఫిబ్రవరి 28 వ తేదీన సర్ సివి రామన్ రామన్ ఎఫెక్ట్ ను కనుగొన్నారు.  ఈ రామన్ ఎఫెక్ట్ ప్రపంచం గతిని మార్చింది.  1930 వ సంవత్సరంలో నోబెల్ బహుమతి అందుకునేలా చేసింది. సైన్స్ రంగం నుంచి ఈ అవార్డు అందుకున్న మొదటి ఆసియా శాస్త్రవేత్తగా అయన గుర్తింపు పొందారు.  సివి రామన్ కు మొదటి నుంచి సైన్స్ పట్ల చెప్పలేని ఆసక్తి ఉన్నది. 


ఈ ఆసక్తితోనే అయన సైన్స్ విద్యను అభ్యసించారు.  రామన్ తండ్రి భౌతిక శాస్త్ర ఉపాద్యాయుడు కావడంతో ఆయనకు ఆ శాస్త్రంలో ఆసక్తి నెలకొన్నది.  కేవలం 12 సంవత్సరాలకే రామన్ మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. తల్లి వీణ, వయోలిన్ వాయుద్యురాలు.  ఆ తీగల నుంచి ఉత్పత్తి అయ్యే ధ్వనిపై పరిశోధనలు చేసి తన పరిశోధనాంశాలను లండన్ కు పంపించేవారు.  ఓసారి అయన ఈ శబ్దతరంగాల గురించి లండన్ లో ఉపన్యాసం ఇచ్చారు.  


అయితే, ప్రేక్షకుల్లో కూర్చొని ఉన్న ఓ వ్యక్తి ఈ శబ్దతరంగాల గురించి మాట్లాడి రాయల్ సొసైటీలో సభ్యుడిగా హోదా సంపాదిస్తావా అని ప్రశ్నించారు.  అది రామన్ కు నచ్చలేదు.  ఎలాగైనా సాధించాలని అనుకున్నారు.  ఇంగ్లాండ్ నుంచి తిరిగి ఇండియాకు షిప్ లో ప్రయాణం చేసే సమయంలో సముద్రంలోని నీళ్లు నీలం రంగులో ఉండటం గమనించారు.  అలానే ఆకాశం కూడా నీలంగా ఉండటం గమనించారు.

 అప్పటి వరకు ఆకాశం ప్రతిబింబం సముద్రంలో కనిపించి సముద్రం నీలి రంగులో ఉంటుందని అనుకున్నారు.  
కానీ, అది నిజం కాదని తేలిపోయింది.  కాంతి సముద్రం నీటిలోకి ప్రవేశించినపుడు అది వికేంద్రీకరణ చెందటంతో ఇలా మారుతుందని తెలుసుకున్నాడు.  దీనిపై వివిధ రకాల పరిశోధనలు చేశారు.  దానికి తగ్గట్టుగా పరిశోధన వ్యాసాలు రాశారు.  1928 ఫిబ్రవరి 16 వ తేదీన దీనిపై అయన బెంగళూరు నగరంలో ప్రసంగం చేశారు.  రామన్ ఎఫెక్ట్ ను 1928 ఫిబ్రవరి 28 వ తేదీన ఆవిష్కరించారు.  ఈ ఆవిష్కరణతో ప్రపంచం చూపులు దేశంవైపు సారించాయి.  ఈ పరిశోధనలకు గాను నోబెల్ బహుమతి ఆయన్ను వరించింది.  1928 ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్ ను ఆవిష్కరించినందుకు గుర్తుగా ప్రతి ఏడాది ఆరోజున జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: