ప్ర‌స్తుతం యూత్ ఎక్కువ‌గా ఎట్రాక్ష‌న్ ఫీల‌వుతున్నారు. దాంతో ప్రేమ‌, ఎట్రాక్ష‌న్‌, మోజూ అంటూ వారి  పార్ట‌నర్స్‌తో ఎక్కువ‌గా శారీర‌క సంబంధాలు కోరుకుంటున్నారు. అయితే వారిలో అధికంగా సెక్స్ అంటే పూర్తిగా  కాకుండా ఇష్ట‌ప‌డిన‌ప్పుడు కేవ‌లం ముద్దులు, కౌగిలింత‌లు వ‌ర‌కేన‌ని ఇటీవ‌లె జ‌రిపిన ఓ స‌ర్వేలో తెలిపారు. అయితే ప్రేమ‌లో ఉన్న‌ప్పుడు కేవ‌లం ముద్దుల వ‌ర‌కేన‌ని అంత‌కు మించి ఇష్ట‌ముండ‌ద‌ని కొంత‌మంది తెలిపారు. వీటికి కూడా చాలా మంది మ‌గ‌వారు దూరంగా ఉంటున్నార‌ట‌. టీనేజ్ లో ప్రేమ అంటే.. కచ్చితంగా శృంగారంలో పాల్గొంటారనే భావన చాలా మందిలో ఉంటుంది. అయితే.. వారి ఆలోచనలు ప‌టాపంచ‌లు చేస్తున్నారు నేటి యువ‌త‌. 

 

 

ఫ్రెండ్ షిప్, లివింగ్ ఇన్ రిలేషన్ షిప్, జోక్స్, సెక్స్, రొమాన్స్ తదితర అంశాల గురించి ఈ  సర్వేలో ఆరా తీశారు. అయితే.. జాతీయ కుటుంబ ఆరోగ్య సంస్థ(ఎన్ఎఫ్ హెచ్ఎస్).. చేసిన ఓ సర్వేలో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శృంగారంలో తొలి అనుభవం కోసం ఈ కాలం యువత కాస్త ఎక్కువగా తొందరపడుతున్నట్లు తెలిసింది.

 

 

ఈ త‌రం యువ‌త శృంగారంలో ఎప్పుడు పాల్గొంటున్నారు అని ఒక తాజాగా స‌ర్వే నిర్వ‌హిస్తే అందులో ఆశ‌క్తి రేకెత్తించే విష‌యాలు అన్నీ తెలిశాయి. అవేంటంటే... దాదాపు లక్షమంది పురుషులు, మరో లక్షమంది మహిళలపై కుటుంబ ఆరోగ్య సర్వే చేశారు. వయసుల మధ్య వ్యత్యాసాలు, ఇక శృంగారంలో పాల్గొన‌డానికి వివిధ గ్రూపులు వారు వెతుక్కుంటున్న ఇబ్బందులు, విద్యాభ్యాసం వ‌ల్ల సెక్స్‌ని వాయిదా వేయ‌డం లాంటివి జ‌రిగాయి. 

 

 

అయితే ఈ సర్వే ప్రకారం.. అమ్మాయిలు 19 ఏళ్లలోపే శృంగార‌ జీవితాన్ని రుచి చూస్తున్న‌ట్లు, పురుషులు 20 నుంచి 24 ఏళ్ళ లోపు శృంగారంలో పాల్గొంటున్న‌ట్లు  తేలింది. పెళ్లికి ముందు సెక్స్ పై నిషేధం ఉన్నప్పటికీ.. 24 ఏళ్లలోపు పురుషుల్లో 11 శాతం మంది, స్త్రీలలో 2 శాతం సెక్స్ లో పాల్గొన్నట్టు వెల్లడించారు. ఈ వయసున్న గ్రూపులో పెళ్లికి ముందే సెక్స్‌లో పాల్గొన్న పురుషులు అత్యధికంగా ఛత్తీస్‌గఢ్‌లో 21.1% మంది, మధ్యప్రదేశ్‌లో 20.7% మంది ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: