పులివెందుల లుంగీ బ్యాచు ఆరోపణలపై వైసిపి సవాలును చంద్రబాబునాయుడు స్వీకరిస్తారా ? ఇపుడిదే అంశంపై చర్చ జరుగుతోంది. విశాఖపట్నం విమానాశ్రయంలో చంద్రబాబును వైసిపి కార్యకర్తలు, స్ధానిక జనాలు అడ్డుకున్న విషయం అందిరికీ తెలిసిందే.  సరే ప్రతిచిన్న విషయాన్ని తన ప్రచారం కోసం ఎలా ఉపయోగించుకోవాలో బాగా తెలిసిన చంద్రబాబు, టిడిపి నేతలు రెచ్చిపోయారు. తనను అడ్డుకునేందుకు వైసిపి తరపున పులివెందుల నుండి లుంగీల బ్యాచ్ విశాఖపట్నంలోకి దిగిపోయిందంటూ ఒకటే ఊదరగొట్టారు.

 

ఇదే విషయమై మంత్రి అవంతి శ్రీనివాస్, వైసిపి అనకాపల్లి  ఎంఎల్ఏ అమరనాధ్ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు.  చంద్రబాబును అడ్డుకునేందుకు పులివెందుల నుండి లుంగీల బ్యాచ్ విశాఖపట్నం రావాల్సిన అవసరం ఏముందంటూ మండిపడ్డారు.  విశాఖ జనాలే చంద్రబాబు వైఖరిని అడ్డుకున్నారంటూ ఇద్దరూ స్పష్టం చేశారు. చంద్రబాబును విశాఖపట్నం దగ్గర అడ్డుకున్న జనాల్లో ఒక్కళ్ళనైనా పులివెందుల వ్యక్తిని చూపించండంటూ సవాలు విసిరటమే ఇపుడు చర్చనీయాంశమైంది.

 

ఒక్కళ్ళనైనా పులివెందుల నుండి వచ్చాడని చూపిస్తే తాను మంత్రిపదవికి రాజీనామా చేస్తానని అవంతి చెప్పారు. అదే విధంగా అమరనాధ్ మాట్లాడుతూ ఒక్క పులివెందుల లుంగి వ్యక్తిని చూపిస్తే తన ఎంఎల్ఏ పదవికి తాను వెంటనే రాజీనామా చేస్తానంటూ సవాలు చేశారు. జరిగిన గొడవపై  టిడిపి మీడియా దగ్గర వీడియో ఫుటేజిలున్నాయి కదా ? దాంట్లో ఎంతమంది పులివెందుల వ్యక్తులున్నారో తేల్చి చెప్పమంటూ అవంతి, అమరనాధ్ చేసిన సవాళ్ళకు మళ్ళీ టిడిపి నుండి సమాధానమే లేదు.

 

జగన్మోహన్ రెడ్డిని గబ్బు పట్టించటమే ఏకైక టార్గెట్ గా చంద్రబాబు, టిడిపి నేతలు పులివెందులను తమిష్టం వచ్చినట్లు వాడేసుకుంటున్నారు. నిజానికి పులివెందుల నుండి వచ్చి విశాఖపట్నంకు వచ్చి చంద్రబాబును అడ్డుకోవాల్సినంత అవసరం ఎవరికుంది ? వైసిపికి విశాఖపట్నంలో జనాలే లేరా ? ఏమిటో టిడిపి పైత్యమే కానీ నోటికేదొస్తే అది మాట్లాడేయటమేనా ?  ఆరోపణలు మాని వైసిపి సవాలుకు సమాధానం ఉంటే చెబితే సరిపోతుంది కదా ?

మరింత సమాచారం తెలుసుకోండి: