ఇటీవలె ఈ జంట కి పెద్దల అనుమతి తో నిశ్చితార్ధం అయ్యింది. ఏప్రిల్ లో పెళ్ళి జరిపించ డానికి ముహుర్తం కూడా పెట్టేసుకున్నారు. ఇంకేం ఉంది హాయిగా బాధ లేకుండా పెళ్ళి కూతురు తల్లిదండ్రులు ఆనందం తో మునిగి పోయారు. ఇంత బాగా చూసుకుంటే తల్లి దండ్రుల కి ఇంకేం కావాలి అని ఆనందం తో ఉన్నారు. అయితే పెళ్ళి ఇంకా కాక ముందే అతడు తరచు గా ఆ పెళ్ళి కుమార్తె ని చూడడానికి పలుమార్లు వస్తూ వెళ్తూ ఉంటున్నాడు.
 
 
IHG
 
 
అయితే వివరాలు లో కి వస్తే వారి వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిశా లో కొరాపుట్ జిల్లా లో ని పొట్టంగి సమితి పంచాయతి పరిధి లో చింతలగుడ గ్రామం వారిది. అయితే ఆ గ్రామానికి చెందిన డుమురి ఖొరా వ్యక్తి కూతురు సుస్మితా ఖొరా. అయితే ఈమె కి ఇటీవలే విశ్వనాధ్ తో పెళ్ళి నిశ్చయం అయ్యింది. విశ్వనాధ్ వాళ్ళది సొంబాయి గ్రామం. 
 
 
పెళ్ళి ఏప్రిల్ నెల లో కావడం వల్ల విశ్వనాధ్ అత్త వారి ఇంటికి వస్తూ వెళ్తూ ఉండేవాడు. ఆ అమ్మాయి తో కాసేపు ముచ్చట్లు పెట్టి కబుర్లు చెప్తూ ఉండేవాడు. ఇలా వస్తూ ఉంటే మర్యాదలు చేసే వారు పెళ్ళి కుమార్తె కుటుంబం లో వాళ్ళు. ఈసారి కూడా అలానే వచ్చాడు. రాత్రి అయ్యిపోవడం తో అక్కడే ఉండి పోమన్నారు. అందరూ నిద్ర పోయారు.
 
IHG
 
 
సమయం చూసుకుని కాబోయే భార్య వద్దకి వెళ్ళాడు. దొరికిందే సమయం అన్నట్లు బ్లేడు తీసి ఆమె పీక కోసేసాడు ఆ దుర్మార్గుడు. కాబోయే భార్య పై హత్యాయత్నం చేసాడు. వెంటనే ఆమె కేకలు వేసేసరికి అంతా వచ్చి ఆసుపత్రి కి తీసుకుని వెళ్ళారు. సకాలం లో వైద్యం అందడం తో ఆమె అపాయం నుండి బయట పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: