కడప జైల్లో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం ఏర్పాటు చేయాలని జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ సెంటర్ ఏర్పాటుకు ఈరోజు హోంమంత్రి మేకతోటి సుచరిత శంకుస్ధాపన చేశారు. జైళ్ళల్లోని ఖైదీల్లో సంస్కరణలు తేవాలని, శిక్ష అనుభవిస్తున్నపుడే వారికి ఏదో ఓ రంగం కానీ లేదా చేతి వృత్తిలో కానీ అవసరమైన శిక్షణ ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇటువంటి శిక్షణను లేదా నైపుణ్యాన్ని మరింత శాస్త్రీయంగా ఇవ్వటం కోసమే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు మేకతోటి చెప్పారు.

 

రాష్ట్రంలోని జైళ్ళల్లో సంస్కరణలు తీసుకురవాటంలో భాగంగానే స్కిల్ డెవలప్మెంట్ సెటర్ ఏర్పాటు చేయాలని జగన్ నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు. కడప జిల్లా కేంద్రంలోని జూల్లో ఏర్పాటు చేయబోయే యూనిట్ కు ప్రభుత్వం రూ. 4.7 కోట్లు మంజూరు చేసినట్లు కూడా మంత్రి తెలిపారు. జైళ్ళల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అన్నది ప్రస్తుతం ప్రపంచం మొత్తం మీద స్విట్జర్లాండ్ లో మాత్రమే ఉందట.

 

జైల్లో ఉన్న ఖైదీల ఆసక్తికి తగ్గట్లుగా నిపుణులను నియమించి అవసరమైన ట్రేడ్లలో పూర్తిస్ధాయి శిక్షణ ఇప్పించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఖైదీలు శిక్షా కాలం పూర్తయిన తర్వాత స్వేచ్చా ప్రపంచంలో తమదైన రీతిలో స్వతంత్రంగా బతకటానికి జైల్లో తీసుకున్న శిక్షణే ఉపయోగపడుతుందని ప్రభుత్వం నమ్ముతోంది.

 

కడప జైల్లో ఇప్పటికే సబ్బుల తయారీ, డైరీ యూనిట్, ఇటుకల తయారీ బట్టీ, ఫినాయిల్. డిటర్జెంట్, సబ్బుల తయారీ యూనిట్లున్నాయి. బేకరీ ఫుడ్ ఐటమ్స్ తయీరు చేస్తున్నారు. టైలరింగ్ యూనిట్ కూడా నడుస్తోంది. అగరబత్తీలు కూడా బాగానే తయారు చేస్తున్నారు. వీటి తయారీ, అమ్మకాల వల్ల బాగానే ఆదాయం వస్తోంది.  ఖైదీలు తయారు చేసి అమ్మే వస్తువల ద్వారా వస్తున్న ఆదాయాన్ని వాళ్ళ బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమచేస్తోంది. శిక్షా కాలం పూర్తయి బయటకు వెళ్ళేటపుడు బ్యాంకులోని డబ్బులను వాళ్ళకు ఇచ్చేస్తుంది ప్రభుత్వం.  మొత్తం స్కిల్ డెవలప్మెంట్ యూనిట్ తో నిజంగానే జైళ్ళల్లో సంస్కరణలు వస్తాయనే అనుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: