కన్నవారు పిల్లలను అల్లరు ముద్దుగా పెంచుతూ.. వారికీ కాల్సినవాని వాళ్ళ ముందు ఉంచుతారు. తల్లిదండ్రులకు వారి పిల్లల తర్వాతే ఏదైనా అనే విషయాన్నిపిల్లలు గమనించ లేకపోతున్నారు. కన్నవాళ్ళు వారి పిల్లల భావిష్యత్తు కోసం చాలా కష్టపడతారు. వారి పిల్లలను ఉన్నత స్థాయిలో చూడాలని కలలు కంటుంటారు. 

 

కానీ ప్రస్తుత సమాజంలో పిల్లలు వారి తొందరపాటు నిర్ణయాలతో వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కన్నవారి కలలను కాలరాస్తూ.. వారు పెట్టుకున్న నమ్మకాలను వొమ్ము చేస్తూ.. పేరెంట్స్ పెట్టుకున్న ఆశలను ఆవిరి చేస్తూ వారి ఆలోచనలతో ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. పిల్లలు తమ క్షణాకావేశంతో వారి ప్రాణాలను బలి తీసుకొని కన్నవారికి శోకాన్ని మిగిలించి వెళ్తున్నారు. 

 

తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వలేదని ఆరో తరగతి బాలిక పురుగుల మందు తాగేసింది. కన్నవారికి తీరని శోకాన్ని మిగిల్చింది. ఈ విషాద ఘటన తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాలో చోటు చేసుకుంది. చేర్యాల మండలం మస్త్యాలకు చెందిన పూస లక్ష్మీ, నరసింహ దంపతులు. వారి కుమార్తె హన్సిక(11) స్థానిక మోడల్ స్కూల్‌ లో ఆరో తరగతి చదువుతోంది.

 

స్కూల్‌ లో ప్రాజెక్ట్ వర్క్ చేసుకురమ్మని చెప్పడంతో హన్సిక తల్లిదండ్రులను రూ.50లు అడిగింది. స్కూల్‌ లో ప్రాజెక్టు ఇచ్చారని.. అందుకు డబ్బులు కావాలని చెప్పింది. అయితే ఉదయాన్నే తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వకుండానే పనులకు వెళ్లిపోయారు. డబ్బులు అడిగినా ఇవ్వలేదని మనస్థాపానికి గురైన బాలిక ఇంట్లో ఉంచిన పురుగుల మందు డబ్బా తీసుకుని తాగేసింది.

 

ఇంటి సమీపంలో ఉంటున్న వారు హన్సిక పురుగుల మందు తాగడం గమనించి ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారు ఇంటికి చేరుకుని బాలికను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ హన్సిక మృతి చెందింది. కేవలం రూ.50లు ఇవ్వలేదని బాలిక ఆత్మహత్య చేసుకోవడం తీవ్రంగా కలచివేసింది. చిన్నారి మృతితో ఆ తల్లిదండ్రులకు శోకసంద్రంలో మునిగిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: