2019 ఎన్నికలు అయ్యి ఇంకా సంవత్సరం కూడా కాలేదు. కానీ అప్పుడే టీడీపీ అండ్ కొ జగన్ మీద వ్యతిరేకిత పెరిగిపోయింది, తర్వాత అధికారంలోకి వచ్చేది మేమే అంటూ జబ్బలు చరవడం మొదలుపెట్టేసింది. అసలు ఘోర ఓటమి ఎలా వచ్చింది. గెలవాల్సిన చోట కూడా ఎందుకు ఓడిపోయాం, మళ్ళీ పుంజుకోవడం ఎలా అనే విధంగా ఆలోచించకుండా, జగన్ పని అయిపోయింది, కాబట్టి 2024లో అధికారం మాదే అంటూ బీద అరుపులు అరుస్తుంది.

 

అయితే ఇప్పుడున్న పరిస్తితులు మీద చూసుకుంటే 2024లో కూడా జగన్‌కే అధికారం దక్కే అవకాశం ఉంది. కాకపోతే జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చిన, రాకపోయిన టీడీపీ మాత్రం కొన్ని చోట్ల అయితే గెలవడం కష్టమని అర్ధమైపోతుంది. అలా టీడీపీ గెలవలేని నియోజకవర్గాలు ఎక్కువగా జగన్ సొంత జిల్లా కడపలోనే ఉన్నాయి. భవిష్యత్‌లో ఆ నియోజకవర్గాల్లో టీడీపీ గెలుపు గగనమని క్లియర్‌గా తెలుస్తోంది.

 

కడపలో పులివెందులని పక్కనబెడితే, టీడీపీ ఖచ్చితంగా గెలవలేని నియోజకవర్గాల్లో రాయచోటి ముందువరుసలో ఉంటుంది. టీడీపీ ఆవిర్భావించాక ఇక్కడ రెండు సార్లు మాత్రమే గెలిచింది. మిగిలిన అన్నిసార్లు కాంగ్రెస్ గెలిచింది. ఇక శ్రీకాంత్ రెడ్డి అడుగుపెట్టిన దగ్గర నుంచి రాయచోటి వైసీపీకే సొంతమవుతుంది. భవిష్యత్‌లో కూడా ఇక్కడ టీడీపీ గెలవడం అసాధ్యమని తెలుస్తోంది.

 

రాయచోటి తర్వాత బద్వేలు, కడప అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ కనుమరుగైపోయింది. అసలు బద్వేలులో టీడీపీ 3 సార్లు గెలిస్తే, కడపలో నాలుగు సార్లు గెలిచింది. ఇక గత నాలుగు పర్యాయాలుగా జరిగిన ఎన్నికల్లో టీడీపీ గెలుపు జాడ లేదు. వరుస ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి పాలవుతుంది. జగన్ రాకముందు కాంగ్రెస్ అడ్డాలుగా ఉన్న ఈ నియోజకవర్గాలు ఇప్పుడు వైసీపీ కంచుకోటలుగా మారిపోయాయి. ఒకవేళ భవిష్యత్‌లో రాష్ట్రంలో అధికారంలోకి రాకపోయిన ఇక్కడ మాత్రం వైసీపీ గెలుపు ఆపడం కష్టం. ఏదేమైనా ఈ మూడు చోట్ల మాత్రం టీడీపీ జన్మలో గెలవదని తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: