పులివెందుల గడ్డ....వైఎస్ ఫ్యామిలీ అడ్డా అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. దశాబ్దాల కాలం నుంచి ఇక్కడ వైఎస్ ఫ్యామిలీని ఢీకొట్టే మొనగాడే లేడు. 1978 నుంచి చూసుకుంటే ఇప్పుడు 2019 వరకు ఇక్కడ వైఎస్ ఫ్యామిలీదే విజయం. అసలు ఆ ఫ్యామిలీ మీద తలపడటానికే నాయకులు ముందుకొచే వాళ్ళు కాదు. అయితే అంతలా వైఎస్ ఫ్యామిలీ మీద పోటీ చేయడానికి భయపడే సమయంలో..ఆ ఫ్యామిలీని ఢీకొనడానికి టీడీపీ నుంచి సతీశ్ రెడ్డి దిగాడు.

 

కానీ వరుస ఓటములు వస్తున్న సతీశ్ మాత్రం వెనక్కి తిరగకుండా వైఎస్ ఫ్యామిలీ మీద పోటీ చేస్తూనే ఉన్నాడు. 2004లో వైఎస్ మీద పోటీ చేసి, దాదాపు 33 వేలు ఓట్లు తెచ్చుకుని ఓటమి పాలయ్యారు. మళ్ళీ 2009లో పోటీకి దిగి 35 ఓట్లు తెచ్చుకున్నారు. అయితే వైఎస్‌కు కాస్త ఫైట్ ఇచ్చిన సతీశ్, జగన్ మీద మాత్రం తేలిపోయారు. 2014లో జగన్ మీద దాదాపు 75 వేల మెజారిటీతో ఓటమి పాలయ్యారు. అయితే 50 వేల ఓట్ల వరకు తెచ్చుకున్నారు. ఇక  2019 ఎన్నికల్లో 90 వేల మెజారిటీతో ఘోరంగా ఓడిపోయారు.

 

ఈ విధంగా ఘోర ఓటమి రావడం, చంద్రబాబు పెద్దగా పట్టించుకోకపోవడం, ఆర్ధికంగా కుంగిపోవడంతో సతీశ్ కొంతకాలంగా రాజకీయాలకు దూరమయ్యారు. అయితే చంద్రబాబు 2011లో సతీశ్‌ని ఎమ్మెల్సీ చేశారు. 2014లో టీడీపీ అధికారంలోకి రావడంతో చంద్రబాబు సతీశ్ రెడ్డిని శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా పదవులిచ్చాడు. కానీ ఆ తర్వాత ఎమ్మెల్సీగా పదవీ కాలం ముగిసినా చంద్రబాబు సతీష్‌రెడ్డికి రెండోసారి అవకాశం ఇవ్వలేదు. కానీ, పులివెందుల నియోజకవర్గానికే చెందిన బీటెక్ రవికి ఎమ్మెల్సీ‌గా అవకాశం ఇచ్చారు.

 

దీంతో అధినేతపై గుర్రుగా ఉన్న సతీశ్ టీడీపీని వీడటానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. త్వరలోనే వైసీపీలోకి వెళ్లిపోతారని ప్రచారం జరుగుతుంది. ఇక ఇలా ప్రచారం జరుగుతున్నా సతీశ్ పార్టీ మార్పుని ఖండిచకపోగా, చంద్రబాబుకు అప్పుడే పోరాటాలు ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త ప్రభుత్వానికి ఒక సంవత్సరం సమయం ఇవ్వకుండా అప్పుడే రచ్చ ఎందుకంటున్నారు. తాను మాత్రం ఒక సంవత్సరం పాటు రాజకీయాల గురించి ఆలోచించకూడదని అనుకుంటున్నట్లు చెప్పేశారు. తర్వాత అనుచరులు, కార్యకర్తలతో మాట్లాడి భవిష్యత్‌పై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: