రాజధాని తరలింపును అడ్డుకోవటంలో చంద్రబాబునాయుడు మాస్టర్ ప్లాన్ వేశారా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది. మూడు రాజధానుల ప్రతిపాదనను జగన్మోహన్ రెడ్డి ప్రకటించినప్పటి నుండి చంద్రబాబు ఏస్ధాయిలో వ్యతిరేకిస్తున్నారో అందరూ చూస్తున్నదే. జగన్ ప్రతిపాదనను అడ్డుకునేందుకు చంద్రబాబు ఎంతగా ప్రయత్నించినా సాధ్యం కావటం లేదు. అందుకనే తన వ్యూహాలను మార్చుకున్నారా ? అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి.

 

న్యాయవ్యవస్ధలో చంద్రబాబుకు ఉన్న పట్టు గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. రాజకీయంగా జగన్ ను ఎదుర్కోలేకపోతున్న చంద్రబాబు తాజా వ్యూహం ప్రకారం జ్యుడీషియల్ ద్వారా నరుక్కొస్తున్నారా అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. ఎందుకంటే రాజధాని తరలింపు విషయంలో విచారణ చేస్తున్న హై కోర్టు చేసిన తాజా వ్యాఖ్యలే ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి.

 

రాజధాని ఏర్పాటు లేదా తరలింపు అన్నది పూర్తిగా రాష్ట్రప్రభుత్వ పరిధిలోని అంశమన్న విషయం అందరికీ తెలిసిందే. జగన్ ప్రతిపాదనను అడ్డుకోవాలని చంద్రబాబు, టిడిపి ఎంపిలు చేసిన విజ్ఞప్తిని కేంద్రం తిరస్కరించింది. అయితే ఇదే అంశంపై హైకోర్టు మాట్లాడుతూ కేంద్రం వైఖరిని తప్పు పట్టడమే ఆశ్చర్యంగా ఉంది. రాజధాని తరలింపులో తమకు బాధ్యత లేదని కేంద్రం చేతులు దులుపుకుంటే కుదరదంటూ కోర్టు వ్యాఖ్యానించటమే ఆశ్చర్యంగా ఉంది.

 

రాజధాని ఏర్పాటులో కేంద్రం కూడా నిధులిచ్చిన విషయాన్ని కోర్టు గుర్తు చేసింది. కాబట్టే రాజధాని తరలింపు విషయంలో కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయాలంటూ కేంద్రాన్ని హై కోర్టు ఆదేశించింటం గమనార్హం. అంటే ఇష్టమున్నా లేకపోయినా కేంద్రం కూడా రాజధాని తరలింపు విషయంలో జోక్యం చేసుకోవాల్సిందే. ఒక వివాదం కోర్టు మెట్లెక్కిన తర్వాత ఎప్పటికి పరిష్కారమవుతుందో ఎవరూ చెప్పలేరు. ఇక్కడే చంద్రబాబు తన పట్టును నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. రాజధాని ఏర్పాటులో కేంద్రం నిధులిస్తే ఆ విషయాన్ని కేంద్ర-రాష్ట్రప్రభుత్వాలు తేల్చుకుంటాయి. అంతేకానీ మధ్యలో కోర్టుకొచ్చిన బాధేమిటో ?

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: