ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం సమర్ధవంతమైన నాయకత్వాన్ని ఆ పార్టీ తయారు చేసుకోవాలి. లేకపోతే ఇబ్బందులు పడటం ఖాయ౦. ఇన్నాళ్ళు ఉన్న జిడ్డు నాయకులను వదిలించుకుని ఆ పార్టీ బలపడితేనె భవిష్యత్తు ఉంటుంది. రాజకీయంగా చంద్రబాబుకి ఎంత అనుభవం ఉన్నా సరే పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా కాకుండా ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు చేస్తే మాత్రం కష్టమవుతుంది. ఇప్పుడు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అదే చేస్తున్నారు. 

 

రాయలసీమకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఒక ఎమ్మెల్యే, ఉత్తరాంధ్ర కు చెందిన ఒక ఎమ్మెల్యే ఇప్పుడు చంద్రబాబు తీరుపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. వాళ్ళు పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పార్టీ కోసం చాలా కష్ట పడ్డారు. రాజకీయంగా ఆ పార్టీ బలోపేతానికి వాళ్ళ వంతు కృషి చేసారు. పార్టీకి అన్ని విధాలుగా అండగా నిలిచారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ మీద కొందరి పెత్తనం ఎక్కువైంది. అనవసరంగా పెత్తనం చెలాయిస్తూ వాళ్ళను ఇబ్బంది పెడుతున్నారు కొందరు నేతలు. 

 

దీనితో ఇక పార్టీకి గుడ్ బై చెప్పాలని భావిస్తున్నారు. బడ్జెట్ సమావేశాల తర్వాత ఇక పార్టీకి గుడ్ బై చెప్పాలనే యోచనలో ఉన్నారు ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు. కీలకమైన బడ్జెట్ సమావేశాల్లో పార్టీ నుంచి తప్పుకుంటున్నట్టు నేరుగా అసెంబ్లీలోనే ప్రకటన చేసే అవకాశం ఉందని టాక్ వినపడుతుంది. ఇప్పటికే ఈ విషయాన్ని అధినేత చంద్రబాబు కి వాళ్ళు చెప్పారని అంటున్నారు. ఒకరు బిజెపిలో మరో ఇద్దరు పార్టీకి రాజీనామా చేసి కేవలం ఎమ్మెల్యేలుగా మాత్రమే ఉండే అవకాశం ఉందని సమాచారం. దీనిపై త్వరలోనే వాళ్ళల్లో ఒక ఎమ్మెల్యే మీడియా సమావేశం పెట్టి ఒక స్పష్టత ఇవ్వాలని చూస్తున్నారట. మరి ఆ ముగ్గురు ఎవరు అనేది చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: