టాలీవుడ్లో ఫిబ్ర‌వ‌రి సినిమాల‌ను విశ్లేషిస్తే బెస్ట్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అవార్డు కోసంన‌లుగురు స్టార్ డైరెక్ట‌ర్లు నాలుగు పెద్ద సినిమాల కోసం పోటీ ప‌డ్డారు. ఈ నెల‌లో జాను, వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌, భీష్మ‌, హిట్ సినిమాలు భారీ అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాయి. ఈ నాలుగు సినిమాల‌కు మంచి పేరున్న మ్యూజిక్ డైరెక్ట‌ర్లే మ్యూజిక్ అందించారు. ముందుగా జాన్ సినిమా విష‌యానికి వ‌స్తే ఈ సినిమాకు గోవింద్ వసంత్ మ్యూజిక్ అందించారు. అస‌లే మ‌న‌స్సును ట‌చ్ చేసే ప్రేమ‌క‌థా చిత్రం కావ‌డంతో చాలా ప్రేమ సన్నివేశాల్లోని ఫీల్ ను మరింత పెంచేలా గోవింద్ వసంత సోల్ ఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు. పాటలు.. నేపథ్య సంగీతం హృదయాల్ని కదిలిస్తాయి.



మ‌రి కొన్ని స‌న్నివేశాల్లో అయితే మ్యూజిక్ థీమ్స్ ఒక అలజడి కలిగిస్తాయి. ఇక విజ‌య్ దేవ‌ర‌కొండ వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ సినిమాకు సంగీతం అందించిన గోపీ సుంద‌ర్ పెద్ద దెబ్బే వేశాడు. ప్రేమకథలకు సంగీతం పెద్ద బలమవ్వాలి. ఐతే లవ్ స్టోరీలకు మంచి ఫీల్ ఉన్న సంగీతం అందిస్తాడని పేరున్న గోపీసుందర్.. ‘వరల్డ్ ఫేమస్ లవర్’కు మాత్రం అన్యాయం చేశాడు. వినసొంపుగా ఉండే ఒక్క పాట కూడా ఇవ్వలేదు. ఈ సినిమా చూసి బ‌య‌ట‌కు వ‌చ్చాక చాలా మంది అబ్బే ఒక్క స‌రైన సాంగ్ కూడా లేదే అని ఫీల‌వ్వ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి.



ఇక భీష్మ సినిమా విష‌యానికి వ‌స్తే మహతి స్వర సాగర్ ఆడియో బ్యాడ్ అనలేం. అలాగని సినిమాకు పెద్ద ఎస్సెట్ కూడా కాలేదు. సోసోగా మ్యూజిక్ ఉంది. ఇక ఈ సినిమాలో సింగిల్ యాంథమ్ ఒక్కటి ప్రత్యేకంగా అనిపిస్తుంది. ‘ఛలో’లో చూసీ చూడంగానే తరహా చార్ట్ బస్టర్ సాంగ్ ఇవ్వకపోవడం మైనస్. అయితే భీష్మ సినిమాకు నేప‌థ్య సంగీతం మాత్రం చాలా పెద్ద ఎస్సెట్ అని చెప్పాలి. ఇక హిట్ సినిమాకు సంగీత ద‌ర్శ‌కుడు వివేక్ సాగ‌ర్ పెద్ద ఎస్సెట్‌గా నిలిచాడు. థ్రిల్లర్ సినిమాకు పర్ఫెక్ట్ అనిపించే బ్యాగ్రౌండ్ స్కోర్ తో అతను ఆకట్టుకున్నాడు. మ‌న రెగ్యుల‌ర్ తెలుగు సినిమాల్లో వినిపించే సౌండ్స్‌కు భిన్నంగా ఈ సినిమాలో సౌండ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి.



ఇక ఓవ‌రాల్‌గా చూస్తే ఈ బెస్ట్ మ్యూజిక్ అవార్డు రేస్ నుంచి గోపీ సుంద‌ర్‌ను ముందే తొల‌గించాలి. ఇక మిగిలిన వారిలో రెండో స్థానంలో వివేక్ సాగ‌ర్‌, మ‌హ‌తి ఉంటే ఫ‌స్ట్ ప్లేస్లో జాను సినిమాకు అద్భుత‌మైన ఫీల్ గుడ్ మ్యూజిక్ ఇచ్చిన గోవింద్ వ‌సంత్ నిల‌వ‌డంతో పాటు హెరాల్డ్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ అవార్డు FEB 2020 అవార్డు సొంతం చేసుకున్నాడు. గోవింద్ వ‌సంత్‌కు ఇండియా హెరాల్డ్ వ‌సుధైక కుటుంబం త‌ర‌పున అభినంద‌న‌లు.

మరింత సమాచారం తెలుసుకోండి: